Bore well Operation: గుజరాత్లో బోరు బావికి బలైన చిన్నారి.. 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ వృధా..
గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో సోమవారం బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆమెను బోరుబావిలో నుంచి బయటకు తీసి రక్షించిన గంటలోపే మరణించినట్లు అధికారులు తెలిపారు.ఎనిమిది గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఏంజెల్ సఖ్రా అనే బాలికను సురక్షితంగా బయటకు తీసి ఖంభాలియా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అసుపత్రిలోని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేతన్ భారతీ పాపను పరీక్షించారు. అయితే రాత్రి 10 నుంచి 10.15 గంటల మధ్య చనిపోయినట్లు ధృవీకరించారు. అసుపత్రికి తరలిస్తుండాగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. పాప బోరు బావిలో పడిన విషయం తెలుసుకున్న వెంటనే పీడియాట్రిక్స్ ట్రైనీని సంఘటనా స్థలానికి పంపినట్లు వైద్యులు తెలిపారు. పసిబిడ్డను బోర్ వెల్ నుంచి బయటకు తీసిన వెంటనే చికిత్స అందించారు. అయితే అస్పిక్సియా కారణంగానే పాప మరణించిందని తెలిపారు. అంటే ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన పాప అటు నుంచి అటే ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. ఎక్కువ సేపు బోరుబావిలో ఉంటడం వల్ల అవసరమైన మేరకు ఆక్సిజన్ అందక విషాదానికి కారణమైందన్నారు.
పోస్ట్ మార్టం పరీక్షలు పూర్తి చేసిన తరువాత మరిన్ని కీలక విషయాలు వెల్లడిస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ద్వారకా జిల్లాలోని రాన్ గ్రామంలోని తన ఇంటి ముందు ఆడుకుంటండగా బోరుబావిలో పడినట్లు తెలిపారు తల్లిదండ్రులు. ఈ సమాచారం అధికారులకు తెలిపిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో ద్వారకా జిల్లా కలెక్టర్ అశోక్ శర్మ సహా సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. దాదాపు 8 గంటలకు పైగా శ్రమించి పాపను బయటకు తీసినప్పటికీ అపస్మారక స్థితిలో నుంచి పాప బయటకు రాలేదు. అసుపత్రికి తరలించిన తరువాత పాప చనిపోయినట్లు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..