AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఇండియాలో అతి చిన్న రైల్వే స్టేషన్ ఇదే.. కేవలం 200 మీటర్లే.. కానీ ఇదే దేశానికి వెన్నెముక

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ భారత్ కలిగి ఉంది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు సరుకు రవాణాలకు రైల్వే వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇండియాలో అతి చిన్న రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో మీకు తెలుసా.. దానికో స్పెషాలిటీ ఉంది.

Indian Railways: ఇండియాలో అతి చిన్న రైల్వే స్టేషన్ ఇదే.. కేవలం 200 మీటర్లే.. కానీ ఇదే దేశానికి వెన్నెముక
Banspani Railway Station
Venkatrao Lella
|

Updated on: Nov 27, 2025 | 5:23 PM

Share

Banspani Railway Station: ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ భారత్‌లో ఉందనే విషయం మనకు తెలిసిందే. వరల్డ్‌లోనే రైల్వే రవాణాతో పాటు ఎక్కువమంది ఉన్న ఉద్యోగుల్లో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. రైళ్లు రోజూ వేలాది మందిని తమ గమ్య స్ధానాలకు చేర్చుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరల్లోనే వీటి ద్వారా దేశ నలుమూలకు ప్రయాణం చేస్తున్నారు. సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ ధరలు ఉండటంతో రైళ్లల్లో ప్రయాణం చేసేందుకు దూరపు ప్రాంతాలు వెళ్లే ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అత్యంత వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లు కూడా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాగా.. త్వలరో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఇక గంటల్లోనే ఎంత దూరమైన జర్నీ చేయొచ్చు.

అతి చిన్న రైల్వే స్టేషన్

భారతదేశంలో ఎన్నో పెద్ద రైల్వే స్టేషన్లు ఉండగా.. చిన్న చిన్న రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇండియాలో అతి చిన్న రైల్వే స్టేషన్ ఒడిశాలోని కియోంఘర్‌లో ఉంది. ఇక్కడ ఉన్న బన్స్‌పానీ రైల్వే స్టేషన్ ఇండియాలోనే అతి చిన్నదిగా ప్రసిద్ది పొందింది. 200 మీటర్ల పొడవుతో ఒకే ఫ్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంది.ఈ రైల్వే స్టేషన్ స్థానిక ప్రజలకు సేవలు అందించడంతో పాటు ఇనుప ఖనిజం వంటి ఖనిజాలను రవాణా చేయడంలో సహయపడుతుంది. ఒడిశాలోని జరోలి తర్వాత బన్స్‌పానీ రైల్వే స్టేషన్ రెండో అతిపెద్ద ఇనుప ఖనిజం లోడిండ్ స్టేషన్‌గా ఉంది. ఇక్కడి నుంచి  గూడ్స్ రైళ్లు ద్వారా టన్నుల కొద్దీ ఇనుప ఖనిజాన్ని దేశంలోని  స్టీల్ ప్లాంట్లకు, ఫ్యాక్టరీలకు పంపిస్తున్నారు. స్టేషన్ చిన్నదైనా వాణిజ్యపరంగా దేశానికి వెన్నుముకలా ఉంది.

ఈ రైళ్లు అటు నుంచే ప్రయాణం

బ్రహ్మపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పూరి-ఆనంద్ విహార్ టెర్మినల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-టాటానగర్-విశాఖపట్నం వీక్లీ లేట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్ నుంచే ప్రయాణ సాగిస్తున్నాయి. అయితే పొడవైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉంచడానికి ఈ ఫ్లాట్‌ఫామ్ పొడవు సరిపోదు. దీంతో ఈ రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఎక్కువ ఆగవు.