Viral Video: ఆ బ్యాంకులోనికి వెళ్లాలంటే నిచ్చెన ఎక్కాల్సిందే… జారి పడితే ఎవరిది బాధ్యత అంటున్న నెటిజన్స్
మీరు బ్యాంకు లోపలికి ఎలా వెళతారు అని ఎవరినైనా అడిగితే.. అదేం ప్రశ్న అంటూ ఎగాదిగా చూస్తారు. ఎలా వెళతారు ప్రధాన ద్వారం గుండా ఆ మాత్రం తెల్వదా అంటూ ఓ పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. అయితే అలా చూసేవారికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న...

మీరు బ్యాంకు లోపలికి ఎలా వెళతారు అని ఎవరినైనా అడిగితే.. అదేం ప్రశ్న అంటూ ఎగాదిగా చూస్తారు. ఎలా వెళతారు ప్రధాన ద్వారం గుండా ఆ మాత్రం తెల్వదా అంటూ ఓ పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. అయితే అలా చూసేవారికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోను చూపించి బ్యాంకులోకి నిచ్చెన వేసుకుని వెళతారు అని చెప్పాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లోకి చేరుకోవడానికి నిచ్చెన ఉంటే తప్పా సాధ్యపడదు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి కస్టమర్లు, సిబ్బంది ట్రాక్టర్ ట్రాలీపై ఉంచిన చెక్క నిచ్చెనను ఎక్కవలసి వచ్చింది. అంటీ ఎంక్రోచ్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అధికారులు బ్యాంకు మెట్లను తొలగించారట. దీంతో పై అంతస్తులో ఉన్న బ్యాంకులోకి నిచ్చెన వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. బ్యాంకుకు వచ్చే వృద్దులు, మహిళలు నిచ్చెన ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
షాక్‌కు గురైన కస్టమర్లు, నివాసితులు భద్రతా ఆందోళనలను వ్యక్తం చేశారు. నిచ్చెన ఎక్కేసమయంలో ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రవేశ మార్గాన్ని పునరుద్ధరించాలని అధికారులను కోరారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోపై నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
अवैध अतिक्रमण अभियान मै हटाया गया SBI की सीडी, एसबीआई शाखा तक पहुंचने के लिए ग्राहकों को सीढ़ी ओर ट्रैक्टर का इस्तेमाल करना पड़ा
SBI, Bhadrak (Odisha). Anti-encroachment drive#OdishaNews pic.twitter.com/3564xFA0jV
— Utkarsh Singh (@utkarshs88) November 25, 2025
