AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది చూశాకా మీరు కూడా వావ్‌.. హైడ్రానా మాజాకా అనకపోతే ఒట్టు… ఎండిపోయిన చెరువుకు జీవం పోస్తే ఇలా ఉంటుంది

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన మరుక్షణమే హైడ్రాను ఏర్పాటు చేశారు. నగరంలో అన్యాక్రాంతం అయిన చెరువులు, ప్రభుత్వ స్థలాలను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో కొంత మంది మినహా...

Viral Video: ఇది చూశాకా మీరు కూడా వావ్‌.. హైడ్రానా మాజాకా అనకపోతే ఒట్టు... ఎండిపోయిన చెరువుకు జీవం పోస్తే ఇలా ఉంటుంది
Hydra Life To Lake
K Sammaiah
|

Updated on: Nov 27, 2025 | 5:09 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన మరుక్షణమే హైడ్రాను ఏర్పాటు చేశారు. నగరంలో అన్యాక్రాంతం అయిన చెరువులు, ప్రభుత్వ స్థలాలను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో కొంత మంది మినహా హైడ్రాకు అన్ని వర్గాల నుంచి మద్దతు వ్యక్తమువుతోంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోన్న ఓ వీడియోను చూసిన నెటిజన్స్‌ హైడ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలోని నల్లకుంట చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఓట్టిపోయిన చెరువుకు తిరిగి జీవం పోసింది హైడ్రా. నల్లకుంట చెరువు పూర్వం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది వీడియోలో స్పష్టంగా చూపించారు. వైరల్ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వైరల్ వీడియోలో, నల్లకుంట చెరువు చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భూమి నుండి పూర్తిగా పునరుద్ధరించబడిన జల వనరుగా మారడాన్ని చూడొచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చివరకు హైడ్రా ద్వారా దానిని పునరుద్ధరించాలని నిర్ణయించే ముందు ఈ జల వనరు ప్రాంతం 2016 నుండి అక్రమ ఆక్రమణకు గురయినట్లు నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.

ఇప్పుడు చెరువు మొత్తం అక్రమ ఆక్రమణల నుండి విముక్తి పొందింది. ఈ డిసెంబర్‌లో చెరువును అధికారికంగా తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ద్వారా చేసిన ముఖ్య మంచి పనులలో ఒకటి అవుతుందని నెటిజన్స్‌ ప్రశంసిస్తున్నారు.

వీడియో చూడండి: