Viral Video: నిశ్చితార్థ వేడుకల్లో వంటవాడు అరెస్ట్… వాడు చేసిన పనికి ఏం చేసిన పాపం లేదంటున్న నెటిజన్స్
వివాహం ముందు జరిగే నిశ్చితార్థ వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఇంటిల్లిపాది ఎంతో సందడి ఉంటుంది. బంధుమిత్రుల కోలాహలం ఉంటుంది. ఎవరికి ఏ లోటు రాకుండా వధూ వరుల కుటుంబాలు చూసుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట అనేకం వైరల్...

వివాహం ముందు జరిగే నిశ్చితార్థ వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఇంటిల్లిపాది ఎంతో సందడి ఉంటుంది. బంధుమిత్రుల కోలాహలం ఉంటుంది. ఎవరికి ఏ లోటు రాకుండా వధూ వరుల కుటుంబాలు చూసుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట అనేకం వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఓ వీడియోను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కోపం కట్టలు తెంచుకుంటుంది.
నవంబర్ 24 సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకలో వంట చేస్తున్నప్పుడు రోటీలపై ఉమ్మి వేస్తున్నట్లు చూపించే వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం రేపుతోంది. ఆ తర్వాత వంటవాడిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలో, వంటవాడు రోటీలపై ఉమ్మి వేస్తున్నట్లు చూడవచ్చు.
నిశ్చితార్థానికి హాజరైన బంధువులు ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వీడియో రికార్డ్ చేశారు. దీని తర్వాత, బాగ్‌పట్‌లోని సింఘవాలి అహిర్ నివాసి మహ్మద్ తౌసిఫ్ పై బాలెని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల మొత్తం నిశ్చితార్థం స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
बागपत में एक सगाई समारोह में तौसीफ थूककर रोटी बना रहा था। किसी ने वीडियो बना लिया। पुलिस हरकत में आ गई। आरोपी को गिरफ्तार कर लिया गया है। तौसीफ काफ़ी समय से ऐसे कार्यक्रमों में रोटी बनाने का काम कर रहा था। pic.twitter.com/UqWiD5pa1c
— Bhadohi Wallah (@Mithileshdhar) November 24, 2025
