Tour Of Duty: అగ్నిపరీక్షలా ‘అగ్నిపథ్‌’.. ఎన్నో ఛాలెంజెస్.. మరెన్నో ప్రశ్నలు.. అమలు తీరు ఎలా.?

Tour Of Duty: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలసిందే. యువత, టెక్నాలజీకి అధిక ప్రధాన్యం కల్పించేలా ఆర్మీ నియామక ప్రక్రియలో కొత్త విధానాన్న...

Tour Of Duty: అగ్నిపరీక్షలా 'అగ్నిపథ్‌'.. ఎన్నో ఛాలెంజెస్.. మరెన్నో ప్రశ్నలు.. అమలు తీరు ఎలా.?
Tour Of Duty
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 14, 2022 | 4:38 PM

Tour Of Duty: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలసిందే. యువత, టెక్నాలజీకి అధిక ప్రధాన్యం కల్పించేలా ఆర్మీ నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఆవిష్కరించారు. అగ్నిపథ్ నియామకాల కోసం టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టనున్నారు. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ఇంతకీ కేంద్రం తీసుకొచ్చిన పథకాన్ని అసలు ఎలా అమలు చేస్తారు.? ఉద్యోగులను నియమించే టూర్‌ ఆఫ్‌ డ్యూటీలను ఎలా నిర్వహిస్తారు.? ఈ విధానంలో ఉన్న చాలెంజెస్‌ ఏంటి.? అన్న వివరాలను మాజీ లెఫ్టెనెంట్‌ జనరల్ డాక్టర్‌ రాకేష్‌ శర్మ టీవీ9తో ప్రత్యేకంగా పంచుకున్నారు. అగ్నిపథ్‌ పథకానికి సంబంధించిన లోతైన విశ్లేషణ రాకేష్‌ శర్మ మాటల్లోనే..

సాయుధ దళాల్లో నియమాకలు ఎక్కువగా గ్రామీణ భారతం నుంచే జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ వంటి దేశ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు శతాబ్దాలుగా సైన్యంలో పనిచేస్తూ వస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో ప్రతీఏటా 60,000 ఉద్యోగాలను భర్తీ చేసేవారు. వీరు సర్వీస్‌లో 15 నుంచి 19 ఏళ్లు సేవలు అందిస్తే వారికి పెన్షన్‌ బెనిఫిట్స్‌ అందేవి. అయితే ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన విధానం ద్వారా 40,000 మందిని రిక్రూట్ చేసుకోనున్నారు. దీనికి ఎంపికైన వారు కేవలం నాలుగేళ్లు మాత్రమే సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఇది ఆర్మీలో చేరాలనుకునే వారిపై భారీగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఇదే అంశం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ పథకం అమలు విషయంలో ఎన్నో ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. సాధారణంగా ఆర్మీలో చేరడానికి లక్షల సంఖ్యలలో నిరుద్యోగులు ముందుకొస్తారు. అందూలోనూ వీరిలో ఎక్కువ మంది పర్మినెంట్‌ ఉద్యోగులు కావాలనే లక్ష్యంతోనే వస్తారు. అలాగే ఆర్మీలో ఇతర ఉద్యోగాల్లో చేరాలనే ఆశాభావంతో ఉంటారు. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ ద్వారా నియమితులైన వారు కూడా అంతకుముందు ఉద్యోగులు చేసిన విధులే నిర్వర్తించాల్సి ఉంటుంది. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించడానికి పెద్ద ఎత్తున సైన్యం అవసరం ఉంటుంది. పెట్రోలింగ్, శత్రువుల ఆకస్మిక దాడులు, చొరబాట్లను ఎదుర్కునేందుకు వేగంగా స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి టూర్‌ ఆఫ్‌ డ్యూటీ ద్వారా ఎంపికైన వారు, అంతకు ముందు ఉన్న వారు ఇద్దరు కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాబట్టి నాలుగేళ్ల కాల పరిమితో సేవ చేయడానికి వచ్చిన వారు నిజాయతీ, పారదర్శకతో పని చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. అయితే ఇదే సమయంలో అధికార దుర్వినియోగం, పక్షపాత వైఖరిలు వంటి ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి వాటిని ముందుగానే ఊహించి, నిష్పక్షపాతంగా వాగ్దానం చేసే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. నాలుగేళ్ల కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత సైనికులు నెలకు రూ. 40,000 జీతంగా పొందొచ్చు. 20 ఏళ్ల వయసులో ఈ స్థాయి జీతం జీతం లభించడం గౌరవప్రదమైనదే అని చెప్పాలి.

సైన్యంలో నాలుగేళ్ల పాటు సేవలందించి కాంట్రాక్ట్‌ పీరియడ్‌ ముగించుకున్న వారిని నేరుగా తొలగించకుండా వారి ఆసక్తికి అనుగుణంగా తిరిగి నైపుణ్యాలను నేర్పించే విధానంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. 2027 నాటికి సేవలో ఉన్న అగ్నివీర్‌ల సంఖ్య దాదాపు 1,60,000కి చేరుతుంది. 2032 నాటికి ఆర్మీలో ఉండే అగ్నివీర్‌ల సంఖ్య 60,000గా ఉంటుంది. అంతేకాకుండా పెన్షన్‌ పొందుతోన్న వారితో సహా ఏటా రిటైర్డ్‌ అవుతోన్న వారి సంఖ్య మొత్తం 90,000 వరకు ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ రీసెటిల్‌మెంట్‌ (DGR) ప్రతీ ఏటా 10,000 కొత్త ఉద్యోగాలను అందిస్తోంది. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ సిబ్బందిని ఇతరలో సేవల్లో కొనసాగించడానికి DGR, AWPO సమిష్టిగా పనిచేయాల్సిన అసవరం ఉంది. కొత్త విధానంలో నియమించుకునే ఉద్యోగుల్లో 5 నుంచి 10 శాతం మంది సైనికులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకోవాలి. నిర్ధిష్ట పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలను వారిలో పెంపొందించాలి.

ఈ కొత్త విధానంలో ఎదురయ్యే రెండో సమస్య ఆల్‌ ఇండియా ఆల్‌ క్లాస్‌ ఇంటెక్‌ రిక్రూట్‌మెంట్‌. ఇది పెద్ద సంఖ్యలో సింగిల్‌ క్లాస్‌ యూనిట్‌లు, సింగిల్‌ క్లాస్‌ సబ్‌ యూనిట్‌లపై ప్రభావం చూపుతుంది. 2032 నాటికి AIAC, అగ్నవీర్లు కలిపి మొత్తం 60,000 మంది సైనికులుగా చేరతారు. పథకం పూర్తి స్థాయిలో అమలు అయినప్పుడు ఈ సంఖ్య మారుతుంటుంది. ఇక ఈ పథకం అమల్లో వచ్చే మరో ప్రధాన సమస్య ఫోర్స్‌ ఆప్టిమైజేషన్‌ ప్రశ్న. గత రెండేళ్లుగా జరిగిన రిక్రూట్‌మెంట్‌లో ఉన్న లోటును ఎలా భర్తీ చేస్తామన్న దానిపై ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. భారత్‌కు ప్రస్తుతం రెండు దేశాల నుంచి ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఓవైపు టూర్‌ ఆఫ్‌ డ్యూటీ ద్వారా ఎంపికైన సైనికులు, AIAC మిలిటరీ ఫోర్స్‌ను ఏకం చేయడం చాలా ముఖ్యమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..