Viral: సెంట్రల్ జైల్లో ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని భార్య.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్

దొంగతనం కేసులో అరెస్టై పంజాబ్‌లోని అంబాలా సెంట్రల్ జైల్లో ఉన్న ఓ ఖైదీని కలిసేందుకు ఆయన భార్య మనీషా వచ్చారు.

Viral: సెంట్రల్ జైల్లో ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని భార్య.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్
Jail
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 14, 2022 | 4:12 PM

Punjab Crime News: పంజాబ్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా ఒకటి. డ్రగ్స్ వ్యాపారం, వినియోగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు. దీంతో కొందరు యువకులు డ్రగ్స్‌కు బానిసై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. నేరుగా విషయంలోకి వెళ్తే.. దొంగతనం కేసులో అరెస్టై అంబాలా సెంట్రల్ జైల్లో కారాగార జీవితాన్ని అనుభవిస్తున్న ఓ ఖైదీని కలిసేందుకు ఆయన భార్య మనీషా వచ్చారు. ఆమె మాటతీరు, వ్యవహార తీరు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

తనిఖీల్లో ఆమె తన లోదుస్తుల్లో దాచిపెట్టుకున్న ఓ పాల్తీన్ కవర్‌ పొట్లంను పోలీసులు గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా.. అందులో 8.23 గ్రాముల హెరాయిన్ దాచి ఉంచడాన్ని గుర్తించి పోలీసులు షాక్‌కు గురైయ్యారు. జైల్లోని తన భర్త కోసం ఆమె ఈ హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో నిర్థారించారు.

జైలు అధికారుల ఫిర్యాదు మేరకు మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలోని సెక్షన్ 21 కింద స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్‌పై ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తలు చదవండి..