Silver Coins: సింధు నది ఒడ్డుకు కొట్టుకొస్తున్న 280 ఏళ్ల నాటి వెండి నాణేలు.. ఏరుకోవడానికి ఎగబడుతున్న జనం

Silver Coins: కొత్తకు వింత పాతకు రోత అన్న సామెత అన్ని విషయాలకు వర్తించదు.. కొన్నింటికి పాతవి అయ్యే కొద్దీ విలువ పెరుగుతుంది. అటువంటి వాటిల్లో పురాతన నాణేలు ఒకటి. ఇప్పటికీ పాత నాణేలకు ఉండే విలువ..

Silver Coins: సింధు నది ఒడ్డుకు కొట్టుకొస్తున్న 280 ఏళ్ల నాటి వెండి నాణేలు.. ఏరుకోవడానికి ఎగబడుతున్న జనం
Silver Coins
Follow us

|

Updated on: Aug 10, 2021 | 2:03 PM

Silver Coins: కొత్తకు వింత పాతకు రోత అన్న సామెత అన్ని విషయాలకు వర్తించదు.. కొన్నింటికి పాతవి అయ్యే కొద్దీ విలువ పెరుగుతుంది. అటువంటి వాటిల్లో పురాతన నాణేలు ఒకటి. ఇప్పటికీ పాత నాణేలకు ఉండే విలువ రోజు రోజుకీ పెరుగుతుంది. కొంతమందికి పురాతన వస్తువులను కొని దాచుకోవడం హాబీ.. అందుకనే వాటిని ఖరీదు చేయడం కోసం లక్షలు వెచ్చిస్తారు. ఇక మన దేశంలో పురాతన నాణేలకు భారీ డిమాండ్ ఉంది. దీంతో చిన్న వస్తువులు కూడా భారీ ధర పలుకుతూ ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వస్తువులు.. ఫ్రీగా దొరుకుతున్నాయంటే.. జనం ఎగబడిమరీ ఏరుకుంటున్నారు.. అవును ఓ గ్రామంలోని నది ఒడ్డున నాణేలు దొరుకుతుండడంతో.. ప్రజలు ఏరుకోవొడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ లో  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ఏర్పడ్డాయి. దీంతో ఆ నీరు సింధు నదిలోకి చేరుకుంది. దీంతో నది గర్భంలో భారీ కదలికలు ఏర్పడి.. నదిలోని వెండి నాణేలు శివపురి జిల్లాలోని పంచవళి గ్రామంలో ఉన్న నది ఒడ్డుకు చేరుకుంటున్నాయి. అటుగా వెళ్తున్న గ్రామస్థులు నది ఒడ్డున మెరుస్తున్న వెండి నాణేలు కనిపించడంతో జనాలు తీసుకోవడం ప్రారంభించారు.

ఈ విషయం ఆటోనోటా ఈ నోటా ఊర్లో మొత్తం షికారు చేసింది. దీంతో పనులు పక్కకు పెట్టి.. నదిలోని వెండి నాణేల వేటకు బయలు దేరారు. పోటీపడి మరీ వెండి నాణేలను సొంతం చేసుకుంటున్నారు. 280 ఏళ్ల నాటి విక్టోరియా ముద్రణ వెండి నాణేలుగా గుర్తించారు.వాటిపై బ్రిటిష్ రాణి బొమ్మలు ఉన్నాయి. ఈ విషయం అధికారులకు కూడా తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెండి నాణేలు మొత్తం ప్రభుత్వానికే చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు చెప్పారు.

ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ లోని 400 గ్రామాలూ పూర్తిగా మునిగి పోయి.600 ఇల్లు దెబ్బతిన్నాయి.1200 మంది ఇల్లు పూర్తిగా కోల్పోయి రోడ్డున పడ్డారు.దీంతో ఇప్పుడు వారికీ ఈ నాణేలు దొరకడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.

Also Read: Singer Sunita: నా పెళ్లి గురించి ఎక్కువుగా వారే ఆలోచించారు.. రామ్‌తో వివాహంపై సునీతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్