వామ్మో ఏంటీ ఈ దారుణం.. ఇద్దరు కొడుకుల తలలు నరికిన తల్లి, ఎందుకంటే
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి తన ఇద్దరు బిడ్డలనే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ చిన్నారుల తల, మొండెం వేరుగా పడున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి తన ఇద్దరు బిడ్డలనే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ చిన్నారుల తల, మొండెం వేరుగా పడున్నాయి. వివరాల్లోకి వెళ్తే గాజీపుర్ జిల్లాలోని హమీర్ పూర్ బిజౌర అనే గ్రామంలో అజిత్ యాదవ్, నీతు యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తె పారీకి 9 ఏళ్లు. కుమారులైన హ్యాపీ(60), హార్దిర్ (10 నెలలు) చిన్నవాళ్లు. అయితే అజిత్ యాదవ్ జమ్మూలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు.శుక్రవారం రాత్రి పిల్లలో కలిసి నిద్రించడానికి నీతు యాదవ్ తన గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారులపై కత్తితో దాడి చేసింది.
కుమారుల ఇద్దరి తలలు నరికేయగా..కుమార్తే పారీ ప్రాణాలతో బయటపడింది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీతు యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా నేరం తానే చేసినట్లు ఒప్పుకుంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేదని.. గత నాలుగైదు సంవత్సరాల నుంచి చికిత్స తీసుకుంటోందని జిల్లా ఎస్పీ తెలిపారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త అజిత్ యాదవ్ జమ్ము నుంచి గాజీపూర్ కు వచ్చారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం




