మన చరిత్ర చెప్పని యుద్ధం.. ప్రాన్స్ పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు భోదిస్తున్న వైనం.. 10 వేల మంది ఆఫ్ఘన్ల ముఠాను మట్టుబెట్టిన 21 మంది సిక్కు యోధుల సాహసం

Battle of Saragarhi: మన దేశ చరిత్ర చెప్పని వీరులు ఎందరో ఉన్నారు. ఈ పోరాట వీరుల గురించి విదేశాల్లో పాఠ్య పుస్తకాలుగా.. కథలుగా చెప్పుకుంటారు. అక్కడ పిల్లలకు దైర్యం, దేశ భక్తి, త్యాగం గురించి ఉదాహరణగా మన రాజులు, మన సైనిక వీరుల పోరాటాలను..

మన చరిత్ర చెప్పని యుద్ధం.. ప్రాన్స్ పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు భోదిస్తున్న వైనం.. 10 వేల మంది ఆఫ్ఘన్ల ముఠాను మట్టుబెట్టిన 21 మంది సిక్కు యోధుల సాహసం
Battle Of Saragarhi

Battle of Saragarhi: మన దేశ చరిత్ర చెప్పని వీరులు ఎందరో ఉన్నారు. ఈ పోరాట వీరుల గురించి విదేశాల్లో పాఠ్య పుస్తకాలుగా.. కథలుగా చెప్పుకుంటారు. అక్కడ పిల్లలకు దైర్యం, దేశ భక్తి, త్యాగం గురించి ఉదాహరణగా మన రాజులు, మన సైనిక వీరుల పోరాటాలను పాఠ్య పుస్తకాల్లో పొందుపరచబడ్డాయి. అలాంటి చరిత్ర చెప్పని వీరులు ఎందరో ఉన్నారు. వారిలో కొన్ని సంవత్సరాల క్రితం 12 వేల ఆఫ్ఘన్ ముష్కర ముఠాను ఓడించిన 21మంది సిక్కు యోధుల గురించి ఈరోజు తెలుసుకుందాం..

యూరోప్‌లోని ముఖ్యంగా ఫ్రాన్స్‌లోని విద్యార్థులకు బోధించబడుతున్న పోరాటం ‘సరగర్హి’. ఒకవైపు 10 వేలకు పైగా ఆఫ్ఘని దొంగలు.. మరోవైపు కేవలం 21 మంది సిక్కు యోధులు.. వీరి మధ్య పోరాటం ఒళ్ళు గగురు పొడిచెంతగా నడించింది.

ఇప్పటి వరకూ సినిమాల ద్వారా లేక చరిత్రలో “గ్రీక్ సపర్త” , “పర్షియన్” వంటి యుద్ధం గురించి తెలుసుకున్నారు. అయితే మనదేశ చరిత చెప్పని. గొప్ప యుద్ధం.. సరగర్హి. సిక్లాండ్‌లో జరిగిన గొప్ప “సరగర్హి”. బ్రిటిష్ వారి హయాంలో ఇండియా, పాకిస్థాన్ కలిసి ఉన్నపుడు పాకిస్థాన్‌లోని సారాగర్హి అనే ప్రాంతంలో 1897 సెప్టెంబర్లో ఈ యుద్ధం జరిగింది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ స్టేట్‌లో 10,000 ఆఫ్ఘన్‌లు దాడి చేశారు… వారు గులిస్తాన్ మరియు లోఖార్ట్ కోటలను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు. ఈ కోటలను మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు.

ఈ కోటల దగ్గర సారాఘర్‌లోని ఒక భద్రతా స్థానం. 36 వ సిక్కు రెజిమెంట్‌కు చెందిన 21 మంది సైనికులు ఉన్నారు. ఈ సైనికులందరూ మజా ప్రాంతానికి చెందినవారు. సిఖ్ రెజిమెంట్ లీడర్ హవల్దార్ ఇషార్ సింగ్ నాయకత్వంలో ఈ 20 మంది సైనికులు నియమించబడ్డారు. కోటను ఆక్రమించుకోవడానికి వచ్చిన 10 వేల మందిని చూసి ఈ సిక్కు యోధులు భయపడలేదు.. వారిని నుంచి కోటను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించారు. అసాధ్యమైన సరే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇషార్ సింగ్ నాయకత్వంలో ఈ సిక్కు యోధులు పోరాడాలని భావించారు. దీంతో 12 ప్టెంబర్ 1817 న సిక్లాండ్ గడ్డపై గొప్ప యుద్ధం జరిగింది.

ప్రపంచంలోని ఐదు గొప్ప యుద్ధాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఒక వైపు 12 వేల మంది ఉన్నారు ఆఫ్ఘన్ ముష్కరులు.. మరో వైపు 21 మంది సిక్కులు .. ఈ యుద్ధంలో 1400 మంది ఆఫ్ఘన్‌లు మరణించారు.అంతేకాదు ఆఫ్ఘన్లు ఓడిపోయారు..ఈ వార్త బిటిష్ అధికారుల ద్వారా ఐరోపా ఖండానికి చేరుకుంది. అలా ప్రపంచం మొత్తం తెలిసింది. 21 మంది సిక్కు యోధుల పోరాటానికి ప్రపంచం ఆశ్చర్యపోయింది.  ఏకంగా యూకే పార్లమెంటులో ఈ 21 మంది హీరోల ధైర్యసాహసాను ప్రశంసిస్తూ.. అందరూ నిలబడ్డారు. పోరాటంలో మరణించిన సిక్కు యొధ్యులకు ఘన నివాళి ఇచ్చారు. అప్పట్లో యుద్ధంలో మరణించిన వీరులకు మరణానంతరం ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు. అంటే ఇప్పుడు నేటి పరం వీర చక్రానికి సమానం. భారత సైనిక చరిత్రలో యుద్ధ సమయంలో సైనికులు తీసుకున్న అత్యంత విచిత్రమైన తుది నిర్ణయంగా ప్రసిద్ధి గాంచింది.

కేవలం 21 మందితో హవల్దార్ ఇషార్ సింగ్ అన్ని వేల మంది దాడిని ఎలా తిప్పి కొట్టారు అన్న విషయాని ఇప్పటికీ ఫ్రాన్స్ లో పాఠంగా చదువుకుంటున్నారు అక్కడ చిన్నారులు. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా.. 21 మంది సిక్కు సైనికులు.. 10 వేల మంది ఆప్ఘనిస్థాన్ ఆక్రమరణదారులపై సారాగర్హి వద్ద జరిపిన భీకరయుద్ధం నేపథ్యంలో కేసరి సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.

 

Also Read:

విఘ్నాలు తొలగిపోవాలంటూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గణపతికి ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ..

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu