Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi US Tour: ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు.. బైడెన్‌తో కీలక భేటీ.. ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రసంగంపై ఉత్కంఠ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరున అమెరికా పర్యటన ఖరారైంది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించాక.. మోడీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి.

Modi US Tour: ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు.. బైడెన్‌తో కీలక భేటీ.. ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రసంగంపై ఉత్కంఠ
Modi Bidden
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 10, 2021 | 6:12 PM

PM Modi may visit USA: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరున అమెరికా పర్యటన ఖరారైంది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించాక.. మోడీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, గత కొంతకాలంగా ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ లో పర్యటన మినహా ఆయన ఏ ఇతర దేశానికి వెళ్ల లేదు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత తొలి పర్యటనలో భాగంగా ఇప్పుడు అమెరికాకు వెళ్లనున్నారు.

అమెరికాలో మూడు రోజుల పాటు ప్రదాని మోడీ పర్యటన సాగనుంది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మోడీ తొలి సారిగా అమెరికా వెళ్తున్నారు. అయితే ఆ ఇద్దరూ ఇప్పటికే మూడు సార్లు వ‌ర్చువ‌ల్‌గా సమావేశమై చర్చించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మోడీ తన టూర్లో భాగంగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ నెల 22న ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వాషింగ్టన్ బయల్దేరుతారు. 23న అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. కరోనా పరిస్థితులు.. ఆర్దిక అంశాలతో పాటుగా .. తీవ్రవావాదం.. ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకున్న తాజా పరిణాలపైన చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

సెప్టెంబర్ 22న మోడీ వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ పయనమవుతారని తెలుస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించాక.. మోడీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్యలో మోడీ అమెరికా టూర్‌ ఉండనుంది. అగ్రరాజ్యం అధినేతను కలవడంతో పాటు.. బైడెన్ ప్రభుత్వంలో ఉన్న అగ్రశ్రేణి అధికారులతో మోడీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇండో పసిఫిక్ అంశాల గురించి ఇరు దేశాల అధినేతలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. చైనాతో సరిహద్దు విషయాల్లో జరుగుతోన్న వివాదాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చిస్తారని అధికారులు అంటున్నారు.

ఇప్పటికే ఆఫ్ఘన్ పరిణామాల పైన అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బ‌ర్న్స్‌ భారత్‌లో పర్యటించి వెళ్లారు. ఆయన భారత జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ఢిల్లీలో భేటి అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప‌రిస్థితుల‌పై వీళ్లిద్దరూ చ‌ర్చించినట్లు సమాచారం. ఇక, ఈనెల 24న వాషింగ్టన్ డీసీలో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. వర్చువల్ విధానం ద్వారా మోడీ, బైడెన్ మూడు సమావేశాల్లో కలిశారు. మార్చిలో జరిగిన క్వాడ్ సమ్మిట్, ఏప్రిల్ నెలలో జరిగిన క్లైమెట్ చేంజ్ సమ్మిట్, జూన్ నెలలో జరిగిన జీ7 సమావేశాల్లో వీరు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. యూకేలో జరిగిన జీ7 సమావేశంలో మోడీ పాల్గొనాల్సి ఉంది. అయితే, కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ పర్యటన రద్దు చేసుకున్నారు.

ఇక, 25న న్యూయార్క్‌లో జరిగే కీలకమైన 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ఐక్యరాజ్య సమితి ఆ సమావేశంలో మాట్లాడే స్పీకర్ల జాబితా విడుదల చేసింది. దీంతో.. ప్రధాని చేసే ఆ ప్రసంగంపైన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కరోనా పరిస్థితులతో పాటుగా తీవ్రవాదంపైన ప్రధాని ఫోకస్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్‌లో తాజాగా తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడటంపైన భారత్ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. అయితే, ప్రధాని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత్ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక, ప్రధాని మోడీ కోవిడ్‌కు ముందు 2019 సెప్టెంబ‌ర్‌లో అమెరికా వెళ్లారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు మోడీ. వీరిద్దరూ కలిసి హౌడీ మోడీ అనే కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

Read Also…  అమెరికాలో క్రికెట్ సందడి.. 7 టీమ్స్.. 10 రోజులు.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్.. ఎప్పటినుంచంటే.!