Narcotics Jihad: లవ్ జిహాద్ పేరుతో నయా వంచన.. దుమారం రేపుతున్న కేరళ బిషప్ వ్యాఖ్యలు..!
దేశవ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్ కార్యకలాపాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన బిషప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Narcotics Jihad: దేశవ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్ కార్యకలాపాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన బిషప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. లవ్ జిహాద్ తరవాత ప్రస్తుతం నార్కోటిక్ జిహాద్‌కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని బిషప్ మార్ జోసెఫ్ కల్లరంగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబార్ చర్చ్ బిషప్ మార్ జోసెఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
క్రైస్తవ బాలికలను ఉగ్ర ఉచ్చులోకి లాగేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, ఇందుకోసం వారు ఆయుధాలు ప్రయోగించలేని చోట నార్కోటిక్స్‌ను వాడుతున్నారని ఆరోపించారు. లవ్ జిహాద్‌లో యువతులను ప్రేమ పేరుతో ఆకట్టుకుని మతం మార్చేవారని, తాజాగా క్రైస్తవ యువతలో డ్రగ్స్ వాడకం ఎక్కువైందని, ఇక్కడ ముస్లిమేతరులు ఎవరూ ఉండకూడదనే ఇదంతా చేస్తున్నారని, అందరూ అలాంటి గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బిషప్ హెచ్చరించారు. సైరో మలబార్ చర్చ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపుతున్నాయి.
ఐఎస్ శిబిరాల్లో ఇతర మతాల మహిళలు ఎందుకు ఉన్నారో పరిశీలించాలన్నా ఆయన.. డ్రగ్స్‌తో క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ముస్లిం ఆలోచనా సరళిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. 2016లోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్ధలో కేరళ నుంచి పలువురు చేరుతున్నారని తొలుత వార్తలు వచ్చాయి. 19 మంది గల్లంతైన వారు ఈ ఉగ్రసంస్ధలో చేరారని వారి కుటుంబ సభ్యలు, బంధువులు పేర్కొనడంతో విచారణ చేపట్టాలని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను కోరింది. కాసర్‌ఘడ్, పలక్కాడ్ జిల్లాలకు చెందిన ఈ 19 మందిలో అత్యధికులు క్రైస్తవ, హిందూ మతాల నుంచి ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారని ఆయన వెల్లడించారు.
ఇదిలావుంటే, లవ్ జిహాద్ తర్వాత క్రైస్తవ యువతీయువకులు టార్గెట్‌గా డ్రగ్ జిహాద్ ప్రబలుతోందని కల్లరన్‌గట్ చర్చి బిషప్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను కేరళ కాంగ్రెస్ కమిటీ తోసిపుచ్చింది. జోసెఫ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పీటీ థామస్ అన్నారు. మేధావి, విద్యావేత్త అయిన బిషప్ జోసెఫ్ ఏ ఆధారంతో ఇలా మాట్లాడారో తమకు అర్ధం కావడం లేదని కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, కేరళలో డ్రగ్ జిహాద్ విస్తరిస్తోందని, రాష్ట్రంలో పెరుగుతున్న నార్కోటిక్స్ సరఫరానే ఇందుకు నిదర్శనమని క్రైస్తవ యువతను మత్తుమందులో ముంచి మత మార్పిడులకు పాల్పడుతున్నారని బిషప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
CM KCR: వినాయక చవితి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం.. కోలాహలంగా ప్రగతి భవన్.. చిత్రాలు