America and China: అమెరికా అధ్యక్షుడు బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య ఫోన్ సంభాషణ..ఏడునెలల తరువాత తొలిసారిగా..

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు.

America and China: అమెరికా అధ్యక్షుడు బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య ఫోన్ సంభాషణ..ఏడునెలల తరువాత తొలిసారిగా..
America And China Talks
Follow us
KVD Varma

|

Updated on: Sep 10, 2021 | 5:27 PM

America and China: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు. వీరిద్దరి మధ్యా ఏడు నెలల తరువాత మొదటిసారిగా ఫోన్ ద్వారా చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య పోటీ వివాదంగా మారకూడదని వైట్ హౌస్ చెప్పింది, దీంతో ఈ చర్చలకు తెరలేచింది. భవిష్యత్తులో అమెరికా, చైనాల మధ్య అవాంఛిత ఘర్షణ మొదలయ్యే పరిస్థితి ఏర్పడకూడదని కూడా చర్చలు జరిగాయి. చైనీస్ మీడియా ప్రకారం, జిన్ పింగ్ అమెరికా విధానాల కారణంగా చైనా ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయో బిడెన్‌తో సంభాషణలో చెప్పారు.

వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇద్దరు నేతల మధ్య విస్తృత వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రయోజనాలు.. ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిగాయి. అటువంటి విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఈ సమావేశంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేదు. అమెరిక, చైనాల మధ్య పోటీకి బాధ్యతను తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ చర్చలు జరిగాయని ఆ ప్రకటన పేర్కొంది.

సంబంధాన్ని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ

ఈ ఫోన్ కాల్ లక్ష్యం రెండు దేశాల మధ్య ట్రాక్ సృష్టించడమేనని, తద్వారా సంబంధంలో బాధ్యత తీసుకురావచ్చని ఒక వైట్ హౌస్ అధికారి చెప్పారు. చైనా చేస్తున్న సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో, కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొంటున్న తీరుపై ఈ సంభాషణ జరిగింది. ఇటీవల, వైట్ హౌస్ చైనీస్ వాణిజ్య నియమాలను తప్పు పడుతూ వస్తోంది.

ప్రెసిడెంట్‌గా జిన్‌పింగ్‌తో బిడెన్ రెండవ సారి చర్చలు..

అధ్యక్షుడైన తర్వాత, బిడెన్ రెండోసారి జిన్‌పింగ్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అంతకుముందు ఫిబ్రవరిలో, అతను చైనా అధ్యక్షుడితో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరు నాయకులు రెండు గంటలు చర్చలు జరిపారు. తరువాత దిగువ స్థాయిలో అమెరికా, చైనాల మధ్య చర్చల ప్రయత్నాలు జరిగాయి. కానీ, వాటి ఫలితాలు సానుకూలంగా లేవు.

ట్రంప్ పదవీకాలంలో..

చైనా తో సంయుక్త సంబంధాలు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో బాగా చెడిపోయాయి. ప్రపంచంలోని మొదటి, రెండు బలమైన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. బిడెన్ అడ్మినిస్ట్రేషన్ బహుళపక్షవాదం, ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని అంతం చేయాలని పిలుపునిచ్చింది. కానీ వాణిజ్య సుంకాలు మారలేదు. అదే సమయంలో, బీజింగ్‌తో సంబంధాల ఇతర వివాదాస్పద సమస్యలపై అమెరికా ఇప్పటికీ కఠినంగా ఉంది.

Also Read: Vaccination: ఈ రాష్ట్రాలలో 100 శాతం టీకాలు వేయడం పూర్తి..! మీ రాష్ట్రం ఇందులో ఉందా..?

JioPhone Next Launch: రిలయన్స్‌ కస్టమర్లకు నిరాశ.. ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌ విడుదల వాయిదా.. మరి ఎప్పుడంటే.!