అమెరికాలో క్రికెట్ సందడి.. 7 టీమ్స్.. 10 రోజులు.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్.. ఎప్పటినుంచంటే.!
American Cricket League: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. లీగ్ క్రికెట్‌లో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఐపీఎల్ తర్వాత ఎన్నో వివిధ దేశాల్లో ఎన్నో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. లీగ్ క్రికెట్‌లో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఐపీఎల్ తర్వాత ఎన్నో వివిధ దేశాల్లో ఎన్నో టీ20 లీగ్స్ పుట్టుకొచ్చినా.. ఒక్కటి కూడా అంతటి క్రేజ్ సంపాదించుకోలేదు. ఇదిలా ఉంటే.. అమెరికాలో క్రికెట్‌కు పునర్వైభావాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీ నుంచి అక్కడ క్రికెట్ సందడి మొదలు కానుంది. యూనైటెడ్ స్టేట్స్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మద్దతుతో అమెరికన్ క్రికెట్ లీగ్(ఏపీఎల్)ను ప్రారంభించనున్నారు. ఈ లీగ్ ఫౌండర్ జయ్ మీర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
మొత్తం 10 రోజుల పాటు సాగనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ప్రతీ రోజూ రెండేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్నీ మ్యాచ్‌లు న్యూజెర్సీలోని యోగి బెర్రా స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నీ ప్రారంభోత్సవం సెప్టెంబర్ 13వ తేదీన అట్టహాసంగా జరగనుంది. కాగా, ఈ లీగ్‌లో మొత్తంగా ఏడు టీమ్స్ పాల్గొనబోతున్నాయి. ఆయా టీమ్స్‌లో భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, అమెరికన్ క్రికెటర్లు భాగం కానున్నారు.