AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 ఏళ్ల వయసులో ప్రపంచకప్ గెలిచాడు.. 20 ఏళ్ళకే ఐపీఎల్‌లో సెంచరీ.. ఫిట్‌నెస్ సమస్యలతో టీమిండియాకు దూరమైన ప్లేయర్ ఎవరంటే?

ఐపీఎల్‌లో పడిపోతున్న ప్రదర్శనతోపాటు గాయాలు చుట్టుముట్టడంతో ప్రతిభ కలిగిన ఓ భారత ఆటగాడు.. టీమిండియా నుంచి దూరమయ్యేలా చేశాయి.

19 ఏళ్ల వయసులో ప్రపంచకప్ గెలిచాడు.. 20 ఏళ్ళకే ఐపీఎల్‌లో సెంచరీ..  ఫిట్‌నెస్ సమస్యలతో టీమిండియాకు దూరమైన ప్లేయర్ ఎవరంటే?
Manish Pandey
Venkata Chari
|

Updated on: Sep 10, 2021 | 1:05 PM

Share

Manish Pandey Birthday: తక్కువ వయసులోనే అద్భుతాలు నెలకొల్పిన ఆటగాడిగా మనీష్ పాండే చరిత్ర సృష్టించాడు. దేశం కోసం ప్రపంచ కప్ గెలిపించి పలు రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లోనూ సెంచరీతో మంచి స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టీమిండియాలో చోటు సంపాధించాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే.. భారత క్రికెట్‌లోని అత్యంత స్టైలిష్ ఆటగాళ్లలో ఒకడు. ఈ రోజు మనీష్ పాండే పుట్టినరోజు. సెప్టెంబర్ 10, 1989 లో జన్మించిన మనీష్ పాండే.. నేటితో 31 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు.

మనీష్ పాండే.. కుమావ్ జిల్లాలోని బాగేశ్వర్‌లో జన్మించారు. అయితే, అతనికి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని కుటుంబం బెంగళూరుకు మారింది. అతని తండ్రి భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. పాఠశాల విద్య అంతా కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. అనంతరం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో భాగం అయ్యాడు. ఇక్కడి నుంచే మనీష్ పాండే క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. మనీష్ పాండే తొలి నాళ్లలో అతిపెద్ద విజయం 2008 సంవత్సరంలో వచ్చింది. భారతదేశవ తరపున అండర్ 19 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యాడు. మలేషియాలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత్ విజయం సాధించింది.

ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడు 2008లో మనీష్ పాండే కెరీర్‌లో మరుపురానిదిగా మారింది. ఐపీఎల్‌లో ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టులో భాగమయ్యాడు. 2009 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆడుతున్నప్పుడు ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు. ఇది అతని మొదటి ఐపీఎల్ సెంచరీ. అలాగే ఈ టోర్నమెంట్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడు కూడా మనీష్ పాండేనే కావడం విశేషం. 2014 లో, అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడినప్పుడు ఫైనల్స్ టీం గెలిచేందుకు తనవంతు సహాయం చేశాడు. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై మనీష్ పాండే 94 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.

వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశం 2015 లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మనీష్ పాండే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాండే వన్డే అరంగేట్రం మ్యాచులోనే కేదార్ జాదవ్‌తో కలిసి 144 పరుగుల భాగస్వామ్యానికి నెలకొల్పాడు. జింబాబ్వే పర్యటనలో పాండే టీ 20 అంతర్జాతీయ అరంగేట్రం జరిగింది. 2016 లో, అతను ఆస్ట్రేలియా పర్యటనలో అవకాశం పొందాడు. సిడ్నీలో జరిగిన వన్డేల్లో 104 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన మనీష్.. మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్రం పోషించాడు. 2016 టీ 20 ప్రపంచకప్‌లో, అతను యువరాజ్ సింగ్‌కు బదులుగా జట్టులో ఎంపికయ్యాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన 15 మంది సభ్యుల జట్టులో కూడా ఉన్నాడు.

ఫిట్‌నెస్ సమస్యలతో టీమిండియాకు దూరం.. ఇటీవల కాలంలో, మనీష్ పాండే తన ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌తో కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో అతని ప్రదర్శన.. ప్రస్తుత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తలనొప్పిగా మారింది. బ్యాటింగ్‌లో అతని స్ట్రైక్ రేట్ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఎన్నో కారణాలతో టీమిండియా నుంచి దూరమయ్యేలా చేశాయి.

Also Read:

బ్రేకింగ్: భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.?

IND vs ENG: మాయని మచ్చలా మారిన మాంచెస్టర్‌ మైదానం.. టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే..!