IND vs ENG: మాయని మచ్చలా మారిన మాంచెస్టర్‌ మైదానం.. టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే..!

5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. మాంచెస్టర్‌లో చివరి టెస్ట్ రెండు జట్లకు కీలకంగా మారింది. అయితే మరీ ముఖ్యంగా ఇంగ్లండ్ టీంకు ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యమైనది.

IND vs ENG: మాయని మచ్చలా మారిన మాంచెస్టర్‌ మైదానం.. టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే..!
India Vs England Test
Follow us
Venkata Chari

|

Updated on: Sep 10, 2021 | 12:56 PM

IND vs ENG: మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య జరగాల్సిన 5 వ టెస్ట్‌పై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి. భారత ఆటగాళ్లకు కరోనా టెస్టుల్లో నెగిటివ్ రావడంతో.. ఈ మ్యాచ్ దాని షెడ్యూల్ ప్రకారం జరుగనుంది. భారత రెండవ ఫిజియో యోగేష్ పర్మార్ కూడా కరోనా టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిన తర్వాత చివరి టెస్ట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కారణంగా టీమిండియా గురువారం తన ప్రాక్టీస్ సెషన్‌ను కూడా రద్దు చేసుకుంది. కరోనా ఫలితాలు వచ్చాక.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రాక్టీస్ లేకుండానే చివరి టెస్టులో టీమిండియా బరిలోకి దిగనుంది.

టీమిండియా రెండవ ఫిజియో యోగేష్ పర్మార్ కరోనా పాజిటివ్‌కి రాకముందే, టీమ్‌లోని సహాయక సిబ్బందిలోని మరో నలుగురు సభ్యులు ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాకుండా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, బృందంలోని మరొక ఫిజియో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రస్తుతం యోగేష్ పర్మార్ కూడా క్వారంటైన్‌లో ఉన్నాడు. అదృష్టవశాత్తూ జట్టులోని ఏ ఆటగాడు కూడా కరోనా సోకలేదు.

గత 9 టెస్టుల్లో టీమిండియా రిజల్ట్స్.. భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య 5 వ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లో జరగనుంది. ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవని ఇంగ్లండ్‌ దేశంలోని మాంచెస్టర్ మైదానం కూడా ఒకటి. మాంచెస్టర్‌లోని వరల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత జట్టు 9 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. కానీ, విజయం మాత్రం టీమిండియాకు చాలా దూరంగా ఉంది. ఈ 9 టెస్టుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే 5 టెస్టులు మాత్రం డ్రాగా ముగిశాయి. అంటే, 50 సంవత్సరాల తర్వాత ఓవల్ టెస్టు గెలిచిన టీమిండియా, మాంచెస్టర్‌లోనూ గెలుపు ఖాతాను తెరవాలని కోరుకుంటోంది. దీంతో సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మైదానంలోనూ భారత చరిత్ర మార్చాలని కోహ్లీ సేన ఆరాటపడుతోంది. ఈ మ్యాచులో గెలిస్తే.. విరాట్ కోహ్లీ సేన 10 వ టెస్టులో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తమ తొలి విజయాన్ని రుచి చూడాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. నాటింగ్‌హామ్‌లో జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. ఆ తర్వాత లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. హెడింగ్లీలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, విరాట్ అండ్ కో ఓవల్ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.

Also Read:

IND vs ENG 5th Test Preview: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య ఐదో టెస్ట్.. చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో టీమిండియా..!

T20 World Cup: భారత్‌, ఆస్ట్రేలియాల నుంచి ఇంగ్లండ్‌ వరకు.. స్టార్ ప్లేయర్లతో పొట్టి ప్రపంచ కప్‌ బరిలో నిలిచిన దేశాలు.. టీంల పూర్తి వివరాలు..!