India Vs England: భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ పూర్తిగా రద్దు.. సిరీస్ విజేత తేలేది అప్పుడే.!

మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్‌ మొదటి రోజు ఆటను తొలుత వాయిదా వేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అయితే తాజాగా తన నిర్ణయాన్ని..

India Vs England: భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ పూర్తిగా రద్దు.. సిరీస్ విజేత తేలేది అప్పుడే.!
India Vs England
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 10, 2021 | 6:51 PM

మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్‌ మొదటి రోజు ఆటను తొలుత వాయిదా వేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అయితే తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ.. మొత్తం టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌కు కరోనా రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ”టీమిండియా జట్టు శిబిరంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ప్లేయర్స్ ఆటపై విముఖత చూపిస్తున్నారు” ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా. బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవించి ఈ టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నామని” ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ వెల్లడించారు.

కాగా, నిన్న జరిపిన కరోనా టెస్టుల్లో టీమిండియా ప్లేయర్స్‌కు నెగిటివ్ వచ్చినప్పటికీ.. కొంతమంది ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్‌ను ఆడేందుకు విముఖత చూపించారు. ఈ క్రమంలోనే ఆయా ప్లేయర్స్ బీసీసీఐకి లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఫిజియో యోగేశ్ పర్మార్, ఇతర సహాయక సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారు.

ఇక ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందాయి. ఇక నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుని సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. నిర్ణయాత్మక ఐదో టెస్ట్ రద్దు కావడంతో విజేత ఎవరన్నది తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సి ఉంది.

2022 జూలైలో టీమిండియా మరోసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ సమయంలో ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని ఈసీబీ.. బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. అప్పుడు వచ్చే ఫలితంగా ఆధారంగా సిరీస్ విన్నర్‌ను నిర్ణయించాలని కోరింది.