Tesla Cars: భారత్‌కు రానున్న టెస్లా ప్రతినిధి బృందం.. కార్ల విక్రయాలపై చర్చలు

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్ల అమ్మకంపై దృష్టి సారించనుంది. బుధ లేదా గురవారాల్లో టెస్లా ప్రతినిధుల బృందం ఇండియాకు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ పర్యటనలో భాగంగా టెస్లా ప్రతినిధులు, ప్రధాని మోదీతో పాటు.. ఇతర ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం.

Tesla Cars: భారత్‌కు రానున్న టెస్లా ప్రతినిధి బృందం.. కార్ల విక్రయాలపై చర్చలు
Elon Musk
Follow us

|

Updated on: May 17, 2023 | 6:42 AM

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్ల అమ్మకంపై దృష్టి సారించనుంది. బుధ లేదా గురవారాల్లో టెస్లా ప్రతినిధుల బృందం ఇండియాకు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ పర్యటనలో భాగంగా టెస్లా ప్రతినిధులు, ప్రధాని మోదీతో పాటు.. ఇతర ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో టెస్లా కార్ల తయారీ, విక్రయం, పన్ను, విడిభాగాల దిగుమతి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేళ టెస్లా ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరిస్తే.. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలోనే దీనిపై ఒప్పందం జరిగే అవకాశం ఉందని మార్కెట్‌ భావిస్తున్నారు. మరోవైపు అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ నెలకొల్పాలని మస్క్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

గత ఏడాది కాలంగా ఎలాన్‌ మస్క్‌ భారత్‌ మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, భారత్‌లో దిగుమతి పన్నులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని కోరారు. ముందుగా విదేశాల్లో తయారు చేసిన టెస్లా వాహనాలను భారత్‌లో అమ్ముతామని.. ఆ తర్వాత టెస్లా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ తెలిపారు. మేకిన్‌ ఇన్‌ ఇండియా నినాదంలో భాగంగా మస్క్‌ ప్రతిపాదనలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. భారత్‌లో కార్ల తయారుచేసేందుకు మస్క్‌ సిద్ధమైతే అందుకు కావాల్సిన వనరులు, సాంకేతికత మన వద్ద ఉన్నాయని.. కానీ ఆయన చైనాలో తయారుచేసిన కార్లను ఇక్కడ విక్రయించాలనుకుంటే అది సరైన ప్రతిపాదన కాదని అప్పట్లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు.

మరోవైపు ప్రస్తుతం టెస్లా కార్లు భారత్‌లో అందుబాటులో లేకపోవడం వల్ల.. లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌ను మెర్సిడెజ్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి కంపెనీలు స్థానికంగా తయారు చేసిన తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ యూనిట్లను చైనా నుంచి భారత్‌‌తో పాటు పలు దేశాల్లో స్థాపిస్తున్నాయి. గతంలో తెలంగాణ, పంజాబ్‌, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ప్రభుత్వాలు సైతం టెస్లా యూనిట్‌ నెలకొల్పేందుకు తమ ఆసక్తిని తెలియజేస్తూ ఆహ్వానాలు పంపాయి. అయితే ఈ క్రమంలోనే టెస్లా ప్రతినిధుల భారత్‌ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.