Sabarimala: కేరళ శబరిమల కొండల్లో అక్రమంగా పూజలు.. ఎవరు చేశారంటే
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో అక్రమంగా పూజలు జరపడం కలకలం రేపుతోంది. స్వామి ఆలయానికి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు పర్వత శిఖరం పైన పూజలు జరిపారు. ప్రస్తుతం ఈ అక్రమల పూజలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో అక్రమంగా పూజలు జరపడం కలకలం రేపుతోంది. స్వామి ఆలయానికి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు పర్వత శిఖరం పైన పూజలు జరిపారు. ప్రస్తుతం ఈ అక్రమల పూజలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. తమిళనాడుకు చెందిన నారాయణ స్వామి అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ పూజలు నిర్వహించినట్లు వీడియోలో గుర్తించారు. ఇంకో విషయం ఏంటంటే పొన్నాంబళమేడు పైనే మకరజ్యోతి వెలిగిస్తారు.
అయితే అయ్యప్ప భక్తులకు ఈ పర్వతం చాలా పవిత్రమైనది. దట్టమైన అడవిలో ఉన్న ఈ పర్వతం అటవీ శాఖ పరిరక్షణలో ఉంటుంది. అయితే ఇలాంటి చోటుకు నిందితులు అక్కడికి ప్రవేశించి అక్రమంగా పూజలు ఎలా జరిపారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి పోలీసులకు, వన్యమృగ శరణాలయ అధిపతికి ఫిర్యాదు చేస్తామని తిరువాన్కూరు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు అనంత గోపన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఉదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.