Revanth Reddy: అక్కడా.. ఇక్కడా.. తగ్గేదేలే.. మహా ఎన్నికల్లో రేవంత్ వ్యూహం..

తెలుగు ప్రజలు అధికంగా ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యటనలు, రోడ్ షోలు చేయనున్నారు. ఆయన తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేకూర్చే విధంగా ప్రయత్నించనున్నారు. తెలుగు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, బీజేపీపై విమర్శలతో ప్రచారం నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు .

Revanth Reddy: అక్కడా.. ఇక్కడా.. తగ్గేదేలే.. మహా ఎన్నికల్లో రేవంత్ వ్యూహం..
Rahul Gandhi - Revanth Reddy
Follow us
Prabhakar M

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 09, 2024 | 6:23 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ కూటమి కొత్త వ్యూహంతో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా, అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములాను అమలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో ఉన్న రేవంత్ ను ఫుల్ ప్లెడ్జ్ గా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యిందట హై కమాండ్.. ఇలా రేవంత్ ఫాలోయింగ్ తో మహారాష్ట్రలో దూసుకెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీజేపీపై కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గ్యారంటీలపై రగడ కొనసాగుతోంది.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ని గెలిపిస్తే మరో తెలంగాణలా అవుతుందని ప్రధాని మోదీ ఇప్పటికే విమర్శలు సంధించగా.. తెలంగాణపై ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే వచ్చానని.. మోదీ అబద్ధాలు చెప్పడం ఆపే వరకు మేము వాస్తవాలు చెబుతూనే ఉంటామంటూ రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం లో పేర్కొన్నారు. తెలంగాణలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని.. సాగు చట్టాలతో రైతులను అదానీ,అంబానీకి అప్పగించే కుట్ర మోదీ చేశారంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. రేవంత్ కూడా ఇప్పటినుంచి మహారాష్ట్రలోనే ఉంటూ పూర్తిగా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. రేవంత్ బలమైన ప్రసంగాలు, బీజేపీపై నేరుగా విమర్శలు చేసే తీరుతో ప్రచారంలో కీలకంగా ఉంటారని కాంగ్రెస్ నమ్ముతుంది .

తెలంగాణ నేతల ఉత్సాహం

మహారాష్ట్రలో ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రచార బాధ్యతలు చేపట్టారు ఏఐసీసీ నేత వంశీ చంద్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ శెట్కర్ ఉన్నారు …రేవంత్ రావడంతో వీరి ఉత్సాహం మరింత పెరిగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ విజయానికి ఈ టీమ్ వర్కవుట్ అవుతుందని హైకమాండ్ విశ్వసిస్తోంది.

మహారాష్ట్రపై రేవంత్ పూర్తి స్థాయి ఫోకస్

మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి రాబోయే వారం నుంచి మరింత ఎక్కువగా పర్యటించనున్నారు. బీజేపీపై తన ప్రసంగాల్లో విమర్శలు చేస్తూ ప్రజలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!