CM KCR: ఇది రాజకీయం కాదు.. జీవన్మరణ పోరాటం.. అలా జరిగినప్పుడే రైతు రాజ్యం.. నాందేడ్ సభలో కేసీఅర్..

దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిందన్న ఆయన..

CM KCR: ఇది రాజకీయం కాదు.. జీవన్మరణ పోరాటం.. అలా జరిగినప్పుడే రైతు రాజ్యం.. నాందేడ్ సభలో కేసీఅర్..
Cm Kcr In Nanded
Follow us

|

Updated on: Feb 05, 2023 | 4:18 PM

దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిందన్న ఆయన.. దేశంలో ఇప్పటికీ సరైన సాగునీరు, కరెంట్ లేదని అన్నారు. నాందేడ్ వేదికగా జరుగుతున్న సభలో బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. ప్రధానులు మారారు, పార్టీలు మారాయి. కానీ.. దేశ పరిస్థితులు మారలేదని మండిపడ్డారు. మహారాష్ట్రాలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలోనూ ఇంతకంటే దుర్భర పరిస్థితుల ఉండేవన్న కేసీఆర్.. రైతు సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని.. రైతులు ఏ కారణంతో మరణించిన 4 రోజుల్లోగా రూ. 5 లక్షల చెక్‌ అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతు బీమా, రైతు బంధుతో ఆదుకుంటున్నాము.

రైతులు పండించిన పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణలో తీసుకొచ్చిన ఈ పథకాలు మహారాష్ట్రలో ఎందుకు లేవు. దేశంలో మేకిన్‌ ఇండియా నినాదం జోకిన్‌ ఇండియాగా మారింది. 75 ఏళ్లలో 70 ఏళ్లు కాంగ్రెస్‌, బీజేపీలే పాలించాయి. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారు. ఇది రాజకీయం కాదు.. జీవన్మరణ సమస్య. దేశ జనాభాలో 42 శాతం రైతులే. రైతులు పండించిన పంటను వారే అమ్ముకోవాలి అప్పుడే రైతు రాజ్యం అవుతుంది. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడు.. మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదు. భారత దేశం పేద దేశం కాదు. భారత్‌ మేధావుల దేశం. భారత్‌ అమెరికా కంటే ఆర్థికవంతమైన దేశంగా ఎదగడం అసాధ్యం కాదు. భారత్‌లో ఉన్నంత సాగు యోగ్యమైన భూమి ప్రపంచంలో మరెక్కడ లేదు.

     – కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

బీఆర్‌ఎస్‌ పార్టీ నాందేడ్‌లో నిర్వహిస్తున్న సభలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాందేడ్‌ కు వెళ్లారు. మధ్యాహ్నం నాందేడ్ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయల్దేరి గురుద్వార్‌ను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణేతర ప్రాంతంలో తొలిసభను ఆదివారం నిర్వహించారు. రెండు వారాలుగా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు సభ విజయవంతం కోసం మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివసిస్తున్న గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..