AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Nanded Meeting Live Updates: మరఠ్వాడ గడ్డపై మారుమోగిన ఆబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కాన్‌ నినాదం.. కేసీఆర్‌ స్పీచ్‌ హైలెట్స్‌.

మరఠ్వాడ గడ్డపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదం మారు మోగింది. దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే...

BRS Nanded Meeting Live Updates: మరఠ్వాడ గడ్డపై మారుమోగిన ఆబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కాన్‌ నినాదం.. కేసీఆర్‌ స్పీచ్‌ హైలెట్స్‌.
Brs Party
Narender Vaitla
|

Updated on: Feb 05, 2023 | 4:51 PM

Share

మరఠ్వాడ గడ్డపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదం మారు మోగింది. దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశామని కేసీఆర్‌ అన్నారు. ప్రధానులు మారారు, పార్టీలు మారాయి. కానీ.. దేశ పరిస్థితులు మారలేదని మండిపడ్డారు. మహారాష్ట్రాలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

తెలంగాణలోనూ ఇంతకంటే దుర్భర పరిస్థితుల ఉండేవన్న కేసీఆర్.. రైతు సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని.. రైతులు ఏ కారణంతో మరణించిన 4 రోజుల్లోగా రూ. 5 లక్షల చెక్‌ అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతు బీమా, రైతు బంధుతో ఆదుకుంటున్నామని తెలపారు. మొత్తం మీద బీఆర్‌ఎస్‌ తొలి జాతీయ బహిరంగ సభ సక్సెస్‌ అయిందని చెప్పొచ్చు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Feb 2023 03:42 PM (IST)

    రైతుల కోసం తెలంగాణలో ఎన్నో చేశాము..

    ‘తెలంగాణలోనూ ఇంతకంటే దుర్భర పరిస్థితుల ఉండేవి. కానీ రైతు సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణలో ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాము. రైతులు ఏ కారణంతో మరణించిన 4 రోజుల్లోగా రూ. 5 లక్షల చెక్‌ అందిస్తాము. రైతు బీమా, రైతు బంధుతో ఆదుకుంటున్నాము. రైతులు పండించిన పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణలో తీసుకొచ్చిన ఈ పథకాలు మహారాష్ట్రాలో ఎందుకు లేవు. దేశవ్యాప్తంగా ఎందుకు లేవు. ఎందుకంటే ఇక్కడ కిసాన్‌ ప్రభుత్వం లేదు కాబట్టి. రైతు రాజ్యం వస్తేనే కరువు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది’ అని సీఎమ్‌ చెప్పుకొచ్చారు.

  • 05 Feb 2023 03:33 PM (IST)

    మేకిన్‌ ఇండియా.. జోకిన్‌ ఇండియాగా మారింది.

    దేశంలో మేకిన్‌ ఇండియా నినాదం జోకిన్‌ ఇండియాగా మారిందని కేసీఆర్‌ అన్నారు. ఈ విషయమై సీఎమ్‌ మాట్లాడుతూ.. ‘మాంజా నుంచి జాతీయ జెండాల వరకు చైనా నుంచి వస్తున్నవే. చిన్న చిన్న పట్టణాల్లోనూ చైనా బజార్‌లు ఎందుకు వచ్చాయి..? చైనా బజార్లు పోయి తెలంగాణ బజార్లు రావాలి. 75 ఏళ్లలో 70 ఏళ్లు కాంగ్రెస్‌, బీజేపీలే పాలించాయి. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారు. ఇది రాజకీయం కాదు.. జీవన్మరణ సమస్య.

  • 05 Feb 2023 03:24 PM (IST)

    ఆబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌..

    మరఠ్వాడ గడ్డపై ఆబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాన్ని మారుమోగించారు సీఎమ్‌ కేసీఆర్‌. సీఎమ్‌ మాట్లాడుతూ.. ‘దేశ జనాభాలో 42 శాతం రైతులే. రైతులు పండించిన పంటను వారే అమ్ముకోవాలి అప్పుడే రైతు రాజ్యం అవుతుంది. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడు.. మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదు. భారత దేశం పేద దేశం కాదు. భారత్‌ మేధావుల దేశం. భారత్‌ అమెరికా కంటే ఆర్థికవంతమైన దేశంగా ఎదగడం అసాధ్యం కాదు. భారత్‌లో ఉన్నంత సాగు యోగ్యమైన భూమి ప్రపంచంలో మరెక్కడ లేద’ని పేర్కొన్నారు.

  • 05 Feb 2023 03:14 PM (IST)

    దేశంలో మార్పులు తీసుకురావడానికే..

    నాందేడ్‌లో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీర్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో మార్పులు తీసుకురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చాము. మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చింది. దేశంలో ఇప్పటికీ సరైన సాగునీరు, కరెంట్ లేదు. ప్రధానులు మారారు, పార్టీలు మారాయి దేశ పరిస్థితులు మారలేదు. మహారాష్ట్రాలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితం అవుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.

  • 05 Feb 2023 03:02 PM (IST)

    సభా స్థలికి చేరుకున్న కేసీఆర్‌..

    తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్‌ నాందేడ్‌లో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు చేరుకున్నారు. ఛత్రపతి శివాజీ, అంబేద్కడర్‌, పూలే విగ్రహాలకు పూలమాల వేశారు సీఎమ్‌. అంతకు ముందు గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • 05 Feb 2023 02:47 PM (IST)

    బీఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తున్న మహిళలు..

    సభకు హాజరైన నాందేడ్‌ మహిళలు బీఆర్‌ఎస్‌ పార్టీని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో వచ్చినట్లు తమకు పించన్‌ రావడం లేదని. కేవలం రూ. 500 పెన్షన్‌ వస్తుంది. కంటి పరీక్షలు చేయడం లేదని. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తమకు కూడా పథకాలు అమలవుతాయని సభకు హాజరైన మహిళలు చెబుతున్నారు.

  • 05 Feb 2023 02:43 PM (IST)

    పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు..

    తెలంగాణ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతోన్న తొలి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దాదాపు 25 వేల మందికిపైగా సభకు వచ్చారు. ఇక నాందేడ్‌కు చెందిన పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

  • 05 Feb 2023 02:32 PM (IST)

     నాందేడ్‌ చేరుకున్న సీఎమ్‌..

    బీఆర్‌ఎస్‌ పార్టీ నాందేడ్‌లో నిర్వహిస్తున్న సభలో పాల్గొనేందుకు సీఎమ్‌ కేసీఆర్‌ నాందేడ్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం నాందేడ్ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న కేసీఆర్‌. నాందేడ్‌లో ఉన్న గురుద్వార్‌ను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేసీఆర్‌ మరికాసేపట్లో బహిరం సభకు వెళ్లనున్నారు.

Published On - Feb 05,2023 2:30 PM