Work From Home Ends: ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేసింది చాలు.. త్వరలో ఆఫీసులకు రండి అంటున్న దేశీయ దిగ్గజ టెక్ సంస్థ
Work From Home Ends: కరోనా వైరస్ కి అడ్డుకట్ట వేయడానికి చాలా సంస్థలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఇచ్చారు. అయితే గత ఏడాదిన్నరకు పైగా..
Work From Home Ends: కరోనా వైరస్ కి అడ్డుకట్ట వేయడానికి చాలా సంస్థలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఇచ్చారు. అయితే గత ఏడాదిన్నరకు పైగా ఉద్యోగులు తమ ఇంట వద్దనుంచి విధులను నిర్వహిస్తున్నారు. దీంతో చాలామంది ఉద్యోగులే కాదు.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు సైతం.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక వద్దు బాబోయ్ అంటున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం.. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమ వేగవంతం కావడం.. ఇంకోవైపు కరోనా పై ప్రజల్లో వచ్చిన అవగాహనతో చాలా సంస్థలు తిరిగి ఆఫీసులను తెరవడానికి రెడీ అవుతున్నాయి.
తాజాగా ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్‌లో వర్క్ ఫ్రం హోంకి శుభం కార్డ్ పడనున్నదని తెలుస్తోంది. తాజాగా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చింది. దేశ, విదేశాల్లో పనిచేస్తున్నమొత్తం 528,748 మంది టీసీఎస్‌లో ఉద్యోగులు నవంబర్ 15లోపు ఆఫీస్ లో జాయిన్ అవ్వాలని ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ మిలింద్ లక్కడ్ చెప్పారు. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగస్తులకు మెయిల్స్ పంపించామని తెలిపారు. తాము తమ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఇప్పటికే సంస్థలోని ఉన్నత ఉద్యోగులు సుమారు 5శాతం మంది ఆఫీసుకు హాజరవుతున్నారని చెప్పారు. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే ప్రకియ దశలవారీగా ఉందనున్నదని చెప్పారు.
2022 జనవరి కల్లా ఉద్యోగుల్ని ఆఫీస్‌లో పనిచేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే టీసీఎస్ ఉద్యోగులు ఆఫీస్‌లో వర్క్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారంటూ పలు మార్లు టిసిఎస్ యాజమాన్యం ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: సముద్రం నుంచి బయటకు వచ్చి.. బురదలో చిక్కుకున్న 272 కేజీల భారీ తాబేలు..