తస్లీమాకు అనుమతి మరో ఏడాది పొడిగింపు

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరో ఏడాదిపాటు ఇక్కడే నివసించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆమె 2020 వరకు భారత్‌లో నివసించడానికి అవసరమైన అనుమతులు లభించినట్టు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. 1994లో ఆమె బంగ్లాదేశ్‌ను వీడి అమెరికా, ఐరోపా దేశాల్లో ఆశ్రయం పొందారు. తర్వాత భారత్‌కు వచ్చారు. ఆమె రచనలతో అసహనానికి గురైన కొన్ని మత ఛాందసవాద సంస్థల బెదిరింపులతో తస్లీమా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో 2004 నుంచి ఆమెకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:34 am, Mon, 22 July 19
తస్లీమాకు అనుమతి మరో ఏడాది పొడిగింపు

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరో ఏడాదిపాటు ఇక్కడే నివసించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆమె 2020 వరకు భారత్‌లో నివసించడానికి అవసరమైన అనుమతులు లభించినట్టు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు.

1994లో ఆమె బంగ్లాదేశ్‌ను వీడి అమెరికా, ఐరోపా దేశాల్లో ఆశ్రయం పొందారు. తర్వాత భారత్‌కు వచ్చారు. ఆమె రచనలతో అసహనానికి గురైన కొన్ని మత ఛాందసవాద సంస్థల బెదిరింపులతో తస్లీమా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో 2004 నుంచి ఆమెకు నివాసానుమతిని పొడిగిస్తూ వస్తున్నారు. ఆమె కోల్‌కతాలో ఉండాలన్ని ఆకాంక్షపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు.