Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. మరో 9మందికి సీరియస్
తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి పది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విరుద్ నగర్ జిల్లాలోని ముత్తుసమయపురం గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి పది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విరుద్ నగర్ జిల్లాలోని ముత్తుసమయపురం గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా అంటుకున్న మంటలతో పేలుడు సంభవించింది. వెరైటీ బాణసంచా తయారీ చేస్తున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాణసంచాలో కెమికల్స్ కారణంగా పేలుడు జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా గోడౌన్‌లో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుపోయారు. పదిమంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సత్తూరు, వెంబకొట్టై, శివకాశీ నుండి ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో మొత్తం 150 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సత్తూరు, శివకాశి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల్లో చేరిన క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి రెవిన్యూ, పోలీస్ అధికారులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదంలో మృతి చెందిన వారికి తమిళనాడులోని పలువురు నేతలు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. బాణాసంచా గోడౌన్లలో తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ గోడౌన్ల యాజమాన్యాలు సరైన భద్రతా ప్రమాణాలు తీసుకోకపోవడం లేదని, అందుకే కార్మికులు తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…