Tamil Nadu Petrol Bomb Attack: రాజభవన్‌పై పెట్రోల్ బాంబు దాడి.. రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ
తమిళనాడు లో పెట్రోల్ బాంబు దాడులు తరచూ జరుగుతుంటాయి. ఎక్కువగా హిందూ సంఘాల నేతలు, బీజేపీ నేతలు ఇళ్లపైనే ఇలా పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. కోయంబత్తూరు, మధురై ప్రాంతాల్లో ఈ బాంబు దాడుల సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన చోట్ల అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే అక్టోబర్ 25న చెన్నైలో తమిళనాడు గవర్నర్ నివాసం ఉండే రాజ్ భవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. రాజ్ భవన్ మెయిన్ గేట్ వద్దనున్న..
చెన్నై, నవంబర్ 15: తమిళనాడు గవర్నర్ బంగళా (రాజ్ భవన్)పై పెట్రోల్ బాంబు దాడి ఘటనపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇప్పటిదాకా పోలీసులు జరిపిన విచారణలో అసలు నిజాలు వెల్లడి కాలేదని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. తాజాగా కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పజెపుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసును ఇకపై NIA విచారించనుంది. దాడి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న అనుమానాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు లో పెట్రోల్ బాంబు దాడులు తరచూ జరుగుతుంటాయి. ఎక్కువగా హిందూ సంఘాల నేతలు, బీజేపీ నేతలు ఇళ్లపైనే ఇలా పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. కోయంబత్తూరు, మధురై ప్రాంతాల్లో ఈ బాంబు దాడుల సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన చోట్ల అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే అక్టోబర్ 25న చెన్నైలో తమిళనాడు గవర్నర్ నివాసం ఉండే రాజ్ భవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. రాజ్ భవన్ మెయిన్ గేట్ వద్దనున్న పోలీస్ బ్యారికేడ్లపై బాంబులు పడ్డాయి.
అక్కడున్న సిబ్బందికి ఎలాంటి అపాయం జరగలేదు. కానీ మెయిన్ గేట్ ఆర్చి దెబ్బతింది. ఘటనపై రాజ్ భవన్ సెక్రెటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పాత నేరస్తుడు, గూండా చట్టం కింద అరెస్టై బెయిల్ పై వచ్చిన కరుక్క వినోద్ పనిగా పోలీసులు నిర్ధారించారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకుని విచారించారు. వినోద్ గతంలో చెన్నైలోని బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయం, తేనామ్ పేట పోలీస్ స్టేషన్, ప్రభుత్వ మద్యం దుకాణం పైనా బాంబు దాడులు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్న వినోద్ పై గూండా యాక్ట్ నమోదు చేశారు. అయితే బెయిల్ పై వచ్చిన వెంటనే ఇలా ఏకంగా రాజ్ భవన్ పైనే అటాక్ చేయడం సంచలనం సృష్టించింది.
దాడి వెనుక అసలు కారణాలు బయటకు రావడంలేదని రాష్ట్ర పోలీసులు విచారణ సరిగ్గా జరపడంలేదని రాజకీయ ఆరోపణలు చేశాయి. అలాగే గవర్నర్ నివాసం ఉండే ఇలాంటి చోట్ల దాడులు జరగడం వాటిని తేలిగ్గా తీసుకోవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది రాజ్ భవన్ వర్గాల మాట. దీంతో కేంద్రం దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎం.ఐ.ఏ కు విచారణను అప్పజెపుతూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో NIA కేసు విచారణలో భాగంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. రాజ్ భవన్ పై దాడి ఘటన వెనుక అసలు కోణం ఏంటి? దాడి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా..? కేసులో అరెస్టైన వినోద్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ జరపనుంది. రాజకీయంగా అనేక వివాదాలు చుట్టుముట్టిన కేసులో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయో చూడాలి మరి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.