Current Shock: బట్టలు ఆరవేసే వైర్లకు కరెంట్‌.. షాక్ కొట్టి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

చిన్న నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడు లోని క్రిష్ణగిరి జిల్లా సింగారపెట్టే గ్రామంలో కరెంట్‌ షాక్‌ తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు...

Current Shock: బట్టలు ఆరవేసే వైర్లకు కరెంట్‌.. షాక్ కొట్టి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Krishnagiri Current Shock
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 08, 2021 | 4:02 PM

చిన్న నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడు లోని క్రిష్ణగిరి జిల్లా సింగారపెట్టే గ్రామంలో కరెంట్‌ షాక్‌ తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నపాపతో పాటు ఇద్దరు మహిళలు ఉండడం అందరిని కలిచివేసింది. బట్టలు ఆరవేసే వైర్లకు కరెంట్‌ వైర్‌ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా తన తల్లి ఇంట్లో ఉంటున్న ఇంద్ర , ఆమె కూతురు కరెంట్‌షాక్‌ తగిలి చనిపోయారు. వారిని కాపాడేందుకు యత్నించిన ఇంద్ర తల్లి కూడా కరెంట్‌ షాక్‌తో చనిపోయారు. ముగ్గురిని కాపాడడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీ వర్షాలకు ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపోయాయి. దాని నుంచి వైర్లు బయటకు వచ్చాయి. ఆ వైర్లు బట్టలు ఆరవేసే వైరుకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

లబ్ధిదారులు చనిపోయినా ఫించన్లు:

సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే.. ఆ విషయాన్ని వాలంటీర్ల సాయంతో ఉన్నతాధికారులకు తెలిపి.. సంబంధిత పేర్లను లిస్ట్ నుంచి తొలగించాలి. అందుకు భిన్నంగా కొందరు ఉద్యోగులు ఏడాదిన్నరగా మృతుల పేర్లపై .. అక్రమంగా లబ్ది పొందుతున్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని చామదల గ్రామంలో ఈ దందా వెలుగుచూసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది పింఛనుదారులు చనిపోయినా.. వారి పేర్లపై చాలాకాలంగా కొందరు నగదు అక్రమంగా పొందుతున్నట్టు జలదంకి ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: సయ్యాట ఆడుతున్న పాములను విడదీశారు.. ఆ తర్వాత అసలు సీన్ స్టార్టయ్యింటి

‘దిగు దిగు దిగు నాగ’ చుట్టూ రాజుకుంటున్న చిచ్చు.. క్రిమినల్ కేసులు..? బ్యాన్..?

సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..