AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digu Digu Naaga song: ‘దిగు దిగు దిగు నాగ’ చుట్టూ రాజుకుంటున్న చిచ్చు.. క్రిమినల్ కేసులు..? బ్యాన్..?

ఈ సినిమాకు ఏమైంది? కాపీ కొట్టడమే మార్గమా? దాని ద్వారా హిట్‌ కొట్టడమే లక్ష్యమా అంటే.. ఈ మధ్య వరుసగా వివాదాస్పదం అవుతున్న పాటలు...

Digu Digu Naaga song:  'దిగు దిగు దిగు నాగ' చుట్టూ రాజుకుంటున్న చిచ్చు.. క్రిమినల్ కేసులు..? బ్యాన్..?
Digu Digi Digu Naga
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2021 | 2:30 PM

Share

ఈ సినిమాకు ఏమైంది? కాపీ కొట్టడమే మార్గమా? దాని ద్వారా హిట్‌ కొట్టడమే లక్ష్యమా అంటే.. ఈ మధ్య వరుసగా వివాదాస్పదం అవుతున్న పాటలు.. అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చేయి తిరిగిన పాటల రచయితలకు కూడా జానపదమే నేపథ్యమా? అంటే అవుననే అంటున్నాయి తాజా పాటలు. ఇటీవల ‘వరుడు కావలెను’ సినిమా కోసం రచయిత అనంత శ్రీరామ్ ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ రాశారు. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించారు. ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్‌పై ఇప్పుడు వివాదం నడుస్తోంది. భక్తి పాటను వ్యాంప్ క్యారెక్టర్‌కు వాడారన్నది అభ్యంతరం. సినిమా యూనిట్‌పై ఏకంగా క్రిమినల్ కేసు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు. ‌

దిగు.. దిగు.. దిగు నాగ సాంగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ చిల్లకూరు మండల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బీజేపీ మోర్చ నాయకులు. నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ రచన ఉందని మండిపడుతున్నారు. హిందూ మనోభావాలు దెబ్బతినేలా భక్తి పాటను అశ్లీల పదాలతో జోడించడం సిగ్గుచేటంటున్నారు నేతలు. పాటను సినిమాలోనే కాదు యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

నాగేంద్ర స్వామిని అవమానపరిచారు.. సినిమాకు సంబంధించిన దర్శక రచయితల మందబుద్ధి తొలగిపోవాలంటూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్రాహ్మణ సంఘాలు నాగ ప్రతిమల వద్ద పూజలు నిర్వహించాయి. డబ్బు సంపాదించుకోవాలంటూ.. మరో మార్గం ఆలోచించాలని కాని.. దేవుడిని ఈ తరహాలో వాడుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మణులు. ఒక జానపదగీతంలో ఇలా ఒక వాక్యం వాడుకున్న సరే. ఆ ఘనత ఆ జానపదులకే ఇవ్వాలి. ఆ అజ్ఞాత రచయితలకు నా పాదాభివందనాలు అంటూ రచయిత అనంత శ్రీరామ్ ట్వీట్ చేశారు. ఈ పాటపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ట్విట్టర్ వేదికగా అనంత శ్రీరామ్‌ను తప్పుబడుతున్నారు. కొంచెం పేరు రాగానే.. ఈ తరహా పాటలు రాస్తావా అంటూ తప్పుబడుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి పాటలు రాసే స్థాయికి దిగావా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read:: కుప్పలు, తెప్పలుగా చేపలు.. కావాల్సిన సైజువి పట్టుకుని.. గంపల్లో ఇంటికి

మరీ ఇంత దారుణమా..! కులం పేరుతో అవమానం.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగినే