Paagal Movie: గర్ల్ ఫ్రెండ్ కోసం విశ్వక్ సేన్ పాగల్ వేషాలు.. వీడియో సాంగ్ రిలీజ్..
మాస్ కా దాస్ విష్వక్ సేన్ ఈ సారి పాగల్‌గా రానున్న విషయం తెలిసిందే.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్..

Paagal : మాస్ కా దాస్ విష్వక్ సేన్ ఈ సారి పాగల్‌గా రానున్న విషయం తెలిసిందే.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ ఊర మాస్ నటనతో మాస్‌కా దాస్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు పాగల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ పాగల్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాగల్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేస్తారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ ఆవార్తల్లో నిజం లేదంటూ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో ఈ సినిమానుంచి టైటిల్ సాంగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘గూగులు గూగులు గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు..’ అంటూ సాగే ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు. ఈ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గర్ల్ ఫ్రెండ్ కోసం విశ్వక్ సేన్ చేసే పాగల్ పనులను ఈ పాటలో చూపించారు. ఈ పాట పై మీరూ ఓ లుక్కెయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :




