Keerthy Suresh: మెగాస్టార్ సిస్టర్‌గా మహానటి.. భారీ పారితోషికం డిమాండ్ చేసిన కీర్తిసురేష్.. షాక్‌లో నిర్మాత
ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేపనిలో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి..

Megastar Chiranjeevi: ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేపనిలో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే చరణ్ సరసన పూజాహెగ్డే చేస్తుంది. ఈ సినిమా తర్వాత మలయాళ లూసిఫర్ సినిమాను రీమేక్ చేయనున్నారు చిరు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తమిళ్‌లో అజిత్ నటించిన వేదాళం సినిమాను రీమేక్ చేయనున్నారు చిరు. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్‌గా స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్‌ను సంప్రదించట మెహర్ రమేష్. కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
వేదాళం సినిమాలో సిస్టర్ రోల్ చాలా కీలకం. సినిమాను మలుపుతిప్పే పాత్రకోసం కీర్తిసురేష్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో హీరోతో సరిసమానంగా ఉంటుంది ఈ పాత్ర. దాంతో కీర్తి కూడా ఒప్పుకుందని టాక్. అయితే ఈ సినిమలో చేయడానికి కీర్తి భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో చిరు సోదరిగా నటించడానికి కీర్తి రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో నిర్మతలు షాక్ తిన్నంత పనైందట. ఈ మూవీలో మెగాస్టార్ పాత్ర సీరియస్ యాక్షన్ మోడ్‌లో సాగుతూనే చక్కని ఫన్‌ని ఎలివేట్ చేసే విధంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :




