భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి.. గవర్నర్ ప్రసంగాన్ని చదివిన స్పీకర్.. ఎందుకిలా..?

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ముందుకుసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఆర్.ఎన్. రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్‌ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు.

భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి.. గవర్నర్ ప్రసంగాన్ని చదివిన స్పీకర్.. ఎందుకిలా..?
Tamil Nadu Assembly
Follow us
Ch Murali

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 12, 2024 | 8:59 PM

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ముందుకుసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఆర్.ఎన్. రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్‌ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్‌ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇదే ఇద్దరి మధ్య మనస్పార్థలకు కారణమవుతోంది. ఇదే అంశంపై బహిరంగంగా ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్‌గా విమర్శలు చేశారు. గత ఏడాది జనవరిలో గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో అక్కడ ఉన్న అంశాలను చదవకపోగా లేని అంశాలను ప్రస్తావించారు. అది కాస్తా వివాదంగా మారింది. ప్రసంగంలో ఉన్న అన్నా దురై, కరుణానిధి పేర్లను గవర్నర్ అసెంబ్లీలో చదవకపోగా తమిళనాడు అన్న పేరును మార్చాల్సిన అవసరం ఉంది.. తమిళగం అని మార్చాలి అంటూ ప్రసంగంలో తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అని చదవడం వివాదంగా మారింది. డీఎంకే ఎమ్మెల్యే గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబట్టడంతో అర్దాంతరంగా తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు.

అయితే, తాజాగా.. బడ్జెట్ సమావేశాల వేదికగా స్టాలిన్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య మరోసారి వివాదం మరింత ముదిరింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో ముందుగా గవర్నర్ ప్రసంగంతో మొదలవడం ఏ రాష్ట్రంలో అయినా ప్రొసీజర్ గా జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టేముందు పరిశీలించారు. అందులో అనేక అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసేలా ఈ ప్రసంగం ఉందని అలాంటి ప్రసంగం చేయలేనని అన్నారు. అలాగే సభలో జాతీయగీతం నియమం కూడా సరిగా లేదని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవకుండానే తన సీటులో కూర్చున్నారు.

దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అప్పావు ను ప్రసంగాన్ని చదవాలని కోరారు. దీంతో గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ చదవడం మొదలుపెట్టారు. దీంతో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దేశ చరిత్రలో గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ చదవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గవర్నర్ కు వ్యతిరేకంగా గతంలో గెట్ అవుట్ రవి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నినదించాయి. తాజా పరిణామాలతో మరోసారి గెట్ అవుట్ రవి నినాదం హ్యాష్ ట్యాగ్ గా మారింది. బీజేపీ, ఎడిఎంకె మినహా అన్ని పార్టీలు గవర్నర్ తీరుపై మండిపడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..