AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: వారు స్థాయికి మించి మద్యం తాగారు: కమల్‌ హాసన్‌

కల్తీమద్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మక్కల్‌ నీది మయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ అన్నారు. ఆదివారం కళ్లకురిచ్చి కల్తీ మద్యం తాగి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. మద్యం తాగిన విషయంలో బాధితులు అజాగ్రత్తగా వహించారని అన్నారు. వారి ఆరోగ్యంపై అధికారులు శ్రద్ద వహించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాలను..

Kamal Haasan: వారు స్థాయికి మించి మద్యం తాగారు: కమల్‌ హాసన్‌
Kamal Haasan
Subhash Goud
|

Updated on: Jun 23, 2024 | 7:39 PM

Share

కల్తీమద్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మక్కల్‌ నీది మయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ అన్నారు. ఆదివారం కళ్లకురిచ్చి కల్తీ మద్యం తాగి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మద్యం తాగిన విషయంలో బాధితులు అజాగ్రత్తగా వహించారని అన్నారు. వారి ఆరోగ్యంపై అధికారులు శ్రద్ద వహించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం తాగిన వారు కూడా వారి స్థాయికి మంచి తాగారని వ్యాఖ్యానించారు. బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని  ప్రభుత్వానికి విన్నవించారు. కల్తీ మద్యం విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా, రాష్ట్రంలోని కళ్లకురిచి హూచ్‌ కల్తీ మద్యం తాగి చాలా మంది మృతి చెందారు. జూన్‌ 19న జరిగిన ఈ ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 56కు చేరింది. అయితే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడులోని కళ్లకురిచి హూచ్ ట్రాజెడీ కేసుకు సంబంధించి, కల్తీ మద్యం తాగి 216 మంది అస్వస్థతకు గురయ్యారని, వారిని తమిళనాడులోని నాలుగు ఆసుపత్రులలో చేర్చారని పోలీసులు తెలిపారు. పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో చేరిన ముగ్గురు రోగులు ఇప్పటివరకు మరణించారు. కళ్లకురిచి హూచ్ ట్రాజెడీ మెడికల్ కాలేజీలో అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక్కడ ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా సేలం మెడికల్ కాలేజీలో చేరిన 18 మంది మరణించారు. అలాగే మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు తమిళనాడు సీఎం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..