AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: సఫారీ ఏనుగు బీభత్సం.. మావటిని తొక్కి చంపిన దృశ్యం భయానకం.. వీడియో వైరల్‌

పర్యాటకుల సఫారీ కోసం సిద్ధం చేస్తున్న ఏనుగు అతన్ని ముందు కాళ్లతో తొక్కి చంపింది. ఆ తర్వాత తొండంతో అతడ్ని విసిరేసింది. ఇది చూసి అక్కడున్న సిబ్బంది షాక్‌ అయ్యారు. ఆ ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు సఫారీ కేంద్రానికి చేరుకున్నారు.

Watch: సఫారీ ఏనుగు బీభత్సం.. మావటిని తొక్కి చంపిన దృశ్యం భయానకం.. వీడియో వైరల్‌
Elephant
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2024 | 7:15 PM

Share

కేరళలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సఫారీ ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కాళ్లతో తొక్కి చంపేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. ఏనుగు మావటిని తొక్కుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.. క్రూర జంతువు కనికరం లేకుండా తన కాళ్ళ క్రింద మావటిని తొక్కేయటం చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 20న సాయంత్రం 6:30 గంటల సమయంలో అడిమాలి సమీపంలోని కల్లార్‌లో ప్రైవేట్ సఫారీ సెంటర్‌లో ఒక ఏనుగు ఆగ్రహం చెందింది. ఇడుక్కిలోని అక్రమ ఏనుగుల సఫారీ కేంద్రంపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది.

మావటి మరణంతో స్టాప్ మెమో జారీ చేసింది. నీలేశ్వరంకు చెందిన 62 ఏళ్ల బాలకృష్ణన్ అనే వ్యక్తి సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో అడిమాలి సమీపంలోని కల్లార్‌లోని ప్రైవేట్ సఫారీ సెంటర్ అయిన కేరళ ఫామ్‌లో ఏనుగు దాడిలో మరణించాడు. పర్యాటకుల సఫారీ కోసం సిద్ధం చేస్తున్న ఏనుగు అతన్ని ముందు కాళ్లతో తొక్కి చంపింది. ఆ తర్వాత తొండంతో అతడ్ని విసిరేసింది. ఇది చూసి అక్కడున్న సిబ్బంది షాక్‌ అయ్యారు. ఆ ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు సఫారీ కేంద్రానికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ కేంద్రంలోని ఏనుగులు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్‌ కాలేదని గుర్తించారు. ప్రైవేట్‌ సఫారీని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని కేసు నమోదు చేశారు. మావటిని ఏనుగు చంపిన నేపథ్యంలో ఏనుగు సఫారీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సఫారీ కేంద్రంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం