AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రెండు ఆవుల మధ్య భీకర పోరు.. బస్సు కిందపడి బైకర్‌ మృతి! షాకింగ్‌ వీడియో వైరల్‌..

ఇంతలో వేగంగా వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు అతడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న అతడి వద్దకు బస్సు డ్రైవర్, స్థానికులు పరుగెత్తుకు వచ్చారు.. వేలాయుధరాజ్‌ మరణానికి కారణమైన ఆవు అనంతరం రోడ్డు దాటి వెళ్లిపోయింది.

Watch: రెండు ఆవుల మధ్య భీకర పోరు.. బస్సు కిందపడి బైకర్‌ మృతి! షాకింగ్‌ వీడియో వైరల్‌..
Man Knocked By Cow
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2024 | 6:54 PM

Share

తమిళనాడులోని తిరునెల్వేలిలో రెండు ఆవుల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి మృతికి దారితీసింది. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు తిరుగుతున్నాయి. ఎదురుగా బస్సు వస్తుండగా, ఒక బైక్ అటు ఇటు వెళ్తోంది. అదే సమయంలో రెండు ఆవులు ఘర్షణ పడుతున్నాయి. ఒక్కసారిగా ఒక ఆవు మరో ఆవును కుమ్మేసింది. దీంతో ఆ ఆవు బైక్ రైడర్‌ను ఢీకొట్టింది. దాంతో బైక్ రైడర్ కిందపడిపోయాడు.. అంతలోనే అటుగా వచ్చిన బస్సు చక్రాలు అతనిపై నుంచి దూసుకెళ్లాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ సంఘటన జరిగింది. మేజిస్ట్రేట్‌ కోర్టులో పనిచేసే 58 ఏళ్ల వేలాయుధరాజ్‌ శనివారం ఉదయం బైక్‌పై విధులకు బయలుదేరాడు.

తమిళనాడులోని ఒక ప్రాంతంలో రోడ్డు పక్కగా రెండు ఆవులు కోట్లాడుకున్నాయి. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వేలాయుధరాజ్‌ను ఒక ఆవు కుమ్మేసింది. దీంతో అతడు ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇంతలో వేగంగా వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు అతడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న అతడి వద్దకు బస్సు డ్రైవర్, స్థానికులు పరుగెత్తుకు వచ్చారు.. వేలాయుధరాజ్‌ మరణానికి కారణమైన ఆవు అనంతరం రోడ్డు దాటి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలాయుధరాజ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం