AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu CM Stalin మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం… అనాథలైన చిన్నారులకు రూ. 5లక్షలు.. అంతేకాదు

అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కోవిడ్ కార‌ణంగా పేరెంట్స్‌ను...

Tamil Nadu CM Stalin మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... అనాథలైన చిన్నారులకు రూ. 5లక్షలు.. అంతేకాదు
M. K. Stalin
Ram Naramaneni
|

Updated on: May 29, 2021 | 4:45 PM

Share

అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కోవిడ్ కార‌ణంగా పేరెంట్స్‌ను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం చ‌ర్య‌లు ప్రారంభించింది. అలాంటి పిల్లలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ డబ్బును చిన్నారుల పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని, వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఇంట్ర‌స్ట్‌తో సహా తీసుకోవచ్చని సీఎం వెల్ల‌డించారు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు రూ.3 లక్షల సాయం అందజేస్తామని ఆయన ప్ర‌క‌టించారు. అంతేగాక, అనాథలైన చిన్నారుల సంరక్షణ, చదువు బాధ్యతలు కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం చెప్పారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేవ‌ర‌కు.. వారి చదువు ఖర్చులు స‌ర్కార్ భరిస్తుందని చెప్పారు. గ‌వ‌ర్న‌మెంట్ హాస్ట‌ల్స్‌లో వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఒకవేళ ఈ హాస్ట‌ల్స్‌లో కాకుండా చిన్నారులు తమ బంధువుల ఇళ్లల్లో ఉండాలనుకుంటే వారికి 18 ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా రూ.3000 సాయం అందజేస్తామని పేర్కొన్నారు. అనాథల‌యిన‌ పిల్లల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివ‌రించారు.

క‌రోనా సెకండ్ వేవ్ ఇండియాలో చేసిన డ్యామేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతోమంది మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి క‌న్నుమూశారు. దీంతో చాలా కుటుంబాలు ఇంటి పెద్ద‌ల‌ను కోల్పోయి రోడ్డున ప‌డ్డాయి. ఈ క్రమంలో అమ్మానాన్నల్ని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు కేంద్రం కూడా సిద్ద‌మ‌య్యింది. అనాథలైన చిన్నారులను గుర్తించి తక్షణ సాయం అందించాలని సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలను ఇటీవ‌ల‌ ఆదేశించింది.

Also Read: కోళ్లను ముద్దు చేస్తున్నారా….. వాటి ద్వారా కొత్త ఇన్‌ఫెక్షన్.. సీడీసీ హెచ్చ‌రిక‌

బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ

Follow Us
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి