AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Stalin: మా ఇంటికొస్తే రుచికరమైన మాంసాహార భోజనం పెడతాం.. సీఎం స్టాలిన్ కు సుగాలీ విద్యార్థినుల ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin).. మరోసారి వార్తల్లో నిలిచారు. సుగాలి విద్యార్థులకు వీడియో కాల్ చేసి వారితో మాట్లాడారు. మీ ఇంటికి వస్తే భోజనం పెడతారా అని రాష్ట్ర ముఖ్యమంత్రే అడగడంతో..

CM Stalin: మా ఇంటికొస్తే రుచికరమైన మాంసాహార భోజనం పెడతాం.. సీఎం స్టాలిన్ కు సుగాలీ విద్యార్థినుల ఆఫర్
Stalin Sugali
Ganesh Mudavath
|

Updated on: Mar 18, 2022 | 7:29 PM

Share

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin).. మరోసారి వార్తల్లో నిలిచారు. సుగాలి విద్యార్థులకు వీడియో కాల్ చేసి వారితో మాట్లాడారు. మీ ఇంటికి వస్తే భోజనం పెడతారా అని రాష్ట్ర ముఖ్యమంత్రే అడగడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమిళనాడులోని(Tamilanadu) ఆవడి ప్రాంతానికి చెందిన మంత్రి నాజర్‌.. తన నియోజకవర్గం పరిధిలో నివసిస్తున్న సుగాలీల కుటాంబాల వద్దకు వెళ్లారు. వారికి అందుతున్న విద్యా సదుపాయాల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో మంత్రి.. విద్యార్థులను సీఎం స్టాలిన్‌తో మాట్లాడించారు. ఈ సంభాషణపై స్టాలిన్ స్పందిస్తూ.. సుగాలీ (Sugali) విద్యార్థినులతో మాట్లాడటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. విద్యార్థినుల కోరికను మన్నించిన స్టాలిన్‌ శుక్రవారం నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగనుండటంతో వెంటనే రాలేనని, వారంలోగా ఆవడికే వచ్చి వారిని కలుసుకుంటానని చెప్పారు.

వెంటనే ఆ విద్యార్థినులు నిజంగా మా ఇళ్ళకు వస్తారా అని ప్రశ్నించగా ‘తప్పకుండా మీ ఇళ్ళకు వస్తాను. వస్తే భోజనం పెడతారా?’ అని నవ్వుతూ స్టాలిన్‌ అడిగారు. వెంటనే విద్యార్థినులు తప్పకుండా రండి మీకు రుచికరమైన మాంసాహార భోజనమే పెడతామని బదులిచ్చారు. తమ ఉన్నత చదువులకు వీలుగా తమ కులాలను ఎంబీసీల జాబితా నుంచి తొలగించి ఎస్టీల్లో చేర్చాలని విద్యార్థినులు కోరారు. ఆ విషయమై న్యాయ నిపుణులతో మాట్లాడి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ వారికి తెలిపారు.

గతంలోనూ స్టాలిన్ ఇలాగే వార్తల్లో ఎక్కారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్రాక్‌సూట్‌లో ఉదయం నడకకు వెళ్లారు. అటుగా వెళ్తోన్న ఓ మహిళ.. సీఎంను గుర్తించి, తన మనసులో దాగున్న ప్రశ్నను అడిగేశారు. ‘మీరు ఇప్పటికీ యువకుడిలా కనిపించడానికి గల రహస్యం ఏంటో చెప్తారా..?’ అంటూ అడిగేసి, పెద్దగా నవ్వేశారు. దానికి స్టాలిన్ కూడా చిరునవ్వులు చిందించారు. మితంగా ఆహారం తీసుకోవడమే అందుకు కారణమంటూ సమాధానమిచ్చారు. ‘ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ.. కొంత సమయం మనుమలు, మనుమరాళ్లతో గడుపుతానని.. వేళకు విశ్రాంతి తీసుకుంటానని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read

TOP 9 ET News: 3గంటల పైనే RRR సినిమా | దుబాయ్‌లో చెర్రీ-తారక్‌ ఫ్యాన్స్ దూం దాం..

Tamilnadu: ఎమ్మెల్యే మ‌న‌వ‌డిని అంటూ బైక్‌పై స్టిక్కర్.. ‘పెళ్లి కాకుండానే ఆ నేతకు మనవడు ఎలా..?’

Hyderabad Jobs: మల్కాజ్‌గిరి భరోసా సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 30 వేల జీతం..