Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect: వారందరికీ ఫ్రీ.. కరోనా సంక్షోభం వేళ శుభవార్త చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ..

Corona Vaccine: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్‌నర్లు..

Corona Effect: వారందరికీ ఫ్రీ.. కరోనా సంక్షోభం వేళ శుభవార్త చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ..
Swiggy Delivery Boys
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 25, 2021 | 2:19 AM

Corona Vaccine: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్‌నర్లు మొదలు.. ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా టీకా ఇప్పిస్తామని ప్రకటించింది. కరోనా టీకా వేయించుకునేందుకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు స్విగ్జీ సీఓఓ వివేక్ సుందర్ బుధవారం నాడు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన మేరకు టీకాకు మాత్రమే కాదు.. ఆ టీకా వేసుకునేందుకు సెలవు తీసుకుంటే ఆ రోజు జీతం కూడా చెల్లిస్తామని తెలిపారు. తమ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్‌నర్లకు కోవిడ్ టీకా ఇప్పించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. వీరికి టీకా కోసం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని సదరు ప్రకటనలో వివేక్ సుందర్ పేర్కొన్నారు.

కాగా, కరోనా వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా టీకా వేయించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే స్విగ్గీలో 45 ఏళ్లు పైబడిన వారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి టీకా వేయించేందుకు స్విగ్గీ అడుగులు ముందుకు వేసింది. కాగా, మొత్తంగా చూసుకుంటే స్విగ్గీలో 2 లక్షల మంది వరకు డెలివరీ పార్ట్‌నర్లు పని చేస్తున్నారు. వీరందరూ కస్టమర్లకు నిత్యం ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. దాంతో ముందుగా వీరికి టీకా ఇప్పించడం ద్వారా కరోనా ముప్పును ఎదుర్కోవచ్చునని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ తాజా నిర్ణయం తీసుకుంది.

ఇదిలాఉంటే.. దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రస్తుతం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి కోవాగ్జిన్ కాగా, మరొకటి కోవిషీల్డ్. ఈ రెండు టీకాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు వైద్యాధికారులు తేల్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన ఈ టీకాను.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వేస్తుండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో డోస్ ధరను రూ. 250గా నిర్ణయించారు. ప్రతి వ్యక్తి రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవడం తప్పనిసరి.

Also read:

COVID-19 Vaccine: కోవిషీల్డ్ Vs కోవాగ్జిన్.. వీటిలో బెస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఏది? సైడ్ ఎఫెక్ట్స్, సమర్థత.. వివరాలు మీకోసం..

India vs England: అంపైర్ల పట్ల గౌరవమే ఉండదు.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్..