COVID-19 Vaccine: కోవిషీల్డ్ Vs కోవాగ్జిన్.. వీటిలో బెస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఏది? సైడ్ ఎఫెక్ట్స్, సమర్థత.. వివరాలు మీకోసం..

COVID-19 Vaccine: సుదీర్ఘ నిరీక్షణ తరువాత కరోనా మహమ్మారిని అడ్డుకునేందకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా..

COVID-19 Vaccine: కోవిషీల్డ్ Vs కోవాగ్జిన్.. వీటిలో బెస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఏది? సైడ్ ఎఫెక్ట్స్, సమర్థత.. వివరాలు మీకోసం..
Covishield Vs Covaxin
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 25, 2021 | 1:56 AM

COVID-19 Vaccine: సుదీర్ఘ నిరీక్షణ తరువాత కరోనా మహమ్మారిని అడ్డుకునేందకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల టీకాలు అందుబాటులోకి రాగా భారత్.. ప్రముఖంగా రెండు రకాల టీకాలు వినియోగంలోకి వచ్చాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ప్రస్తుత దశలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, 45 ఏళ్లు పైబడిన కొమొర్బిడిటీ ఉన్నవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే టీకా విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీకా తీసుకున్న చాలా మంది లబ్ధి దారులు.. మిగతా ప్రజలను టీకా వేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. టీకా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలేంటో వివరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ కాగా, మరొకటి దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్. అయితే ఈ రెండు టీకాల్లో ఏది మంచిది అనే దానిపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ టీకా మంచిది? ఏ టీకా ప్రభావం ఎంత? వంటి ప్రశ్నలను జనాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల పనితీరు, వారి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం.. కోవిషీల్డ్-కోవాగ్జిన్ వివరాలు ఇలా ఉన్నాయి.

కోవిషీల్డ్: ఇది ఇంట్రామస్కులర్ టీకా డెవలపర్: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా చేత అభివృద్ధి చేయగా.. మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేస్తోంది. టీకా రకం: వైరల్ వెక్టర్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించి దీనిని తయారు చేశారు. హానిచేయని చింపాంజీ అడెనోవైరస్ కలిగి ఉంది వైరస్‌ను నియంత్రించేందుకు రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఎబోలా వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడింది. ఈ టీకాను రెండు డోస్‌లు వేసుకోవాల్సి ఉంటుంది. సమర్థత: ఈ వ్యాక్సిన్ 81.3% సమర్థవంతంగా పనిచేసినట్లు మెడికల్ రిపోస్ట్ చెబుతున్నాయి. ధర – ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు, క్లినిక్‌లకు డోస్‌కు రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు.

కోవిషీల్డ్ దుష్ప్రభావాలు: ఇంజెక్షన్ వేసిన చోట నొప్పిగా ఉంటుంది. తలనొప్పి అలసట కండరాల లేదా కీళ్ల నొప్పులు జ్వరం చలి వికారం ఉంటుంది.

కోవాక్సిన్ వివరాలు: ఇది ఇంట్రామస్కులర్ టీకా డెవలపర్ – ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. టీకా రకం: క్రియారహితం చేసిన టీకా హోల్-విరియన్ ఇనాక్టివేటెడ్ వెరో సెల్-డ్రైవ్‌డ్ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. క్రియారహిత వైరస్లను కలిగి, కోవాక్సిన్ క్రియాశీల వైరస్‌కు వ్యతిరేకంగా రక్షణ యంత్రాంగాన్ని సిద్ధం చేయడానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ ఇన్ఫ్లుయేంజా, రాబిస్, పోలియో, ఇతర వ్యాధులకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. డోస్: రెండు డోసులు తీసుకోవాలి. సమర్థత: మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఈ వ్యాక్సిన్ 80.6% శాతం ప్రభావితం చూపుతోంది. ధర – ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితం, ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 250కి లభిస్తోంది.

కోవాక్సిన్ దుష్ప్రభావాలు: ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి, వాపు, ఎర్రగా మారడం, దురదగా ఉంటుంది. ఇంజెక్షన్ వేసిన చేయి మొద్దుబారినట్లుగా అనిపించడం. బలహీనతగా అనిపించడం. ఒళ్లు నొప్పులు తలనొప్పి జ్వరం అనారోగ్యానికి గురైనట్లు అనిపించడం బలహీనత దద్దుర్లు వికారం వాంతులు

Also read:

పాలనా రాజధానిపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కొత్త హంగులు దిద్దుకుంటున్న విశాఖ.. అభివృద్ధి పరుగులు పెట్టాలన్న సీఎం జగన్

HAL Recruitment 2021: హిందుస్తాన్ ఏరోనాటికల్‌లో భారీగా ఉద్యోగాలు.. ప్రారంభ జీతమే రూ. 40 వేలు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?

కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!