వీధి కుక్కనా మజాకానా ! సుప్రీంకోర్టుకు క్యూ కట్టిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు..!
ఆయా రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా చార్ట్ తయారు చేయాలని అమికస్ క్యూరీ గౌరవ అగర్వాల్ కి సుప్రీంకోర్టు సూచించింది. కుక్కకాటు బాధితులను కూడా కేసులో ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. వీధి కుక్కల నియంత్రణపై తాము ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేయకపోతే సిఎస్ లు మరోసారి కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

సోమవారం (నవంబర్ 3 , 2025) వీధికుక్కల కేసుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. వాటిలో అనేక ముఖ్యమైన విషయాలు ప్రస్తావించలేదని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రశ్నించారు. అక్టోబర్ 27న, అఫిడవిట్లు దాఖలు చేయనందుకు సుప్రీంకోర్టు రాష్ట్రాలను మందలించింది. అయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
వీధి కుక్కల విషయంలో వివరణ ఇచ్చేందుకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు..ఆగష్టు 22న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వీధి కుక్కల నియంత్రణ,నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేరుగా కోర్టులో హాజరై క్షమాపణలు చెప్పారు. వీధి కుక్కల నియంత్రణ పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేశారు.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులంతా సుప్రీంకోర్టులో హాజరయ్యారు. వీధి కుక్కల విషయంలో జాతీయ విధానాన్ని రూపొందించే అంశంపై జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల సకాలం లో స్పందించినందుకు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తరపున సుప్రీంకోర్టు కు క్షమాపణలు చెప్పారు. రాష్ట్రాల వారిగా ఎందుకు కోర్టు ఉత్తర్వులపై స్పందించలేదో? రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోర్టు వివరణ కోరింది.
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సహా పలు రాష్ట్రాల సిఎస్ లు హాజరయ్యారు. తమ తీర్పును ఎందుకు అమలు చేయలేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ను ప్రశ్నించిన జస్టిస్ విక్రమనాథ్ ప్రశ్నించారు. అక్టోబర్ 29న అఫిడవిట్ దాఖలు చేశామని, ఏపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి పలు కీలక అంశాలపై చార్ట్ రూపొందించాలని కోర్టుకు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి సూచించారు.
ఆయా రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా చార్ట్ తయారు చేయాలని అమికస్ క్యూరీ గౌరవ అగర్వాల్ కి సుప్రీంకోర్టు సూచించింది. కుక్కకాటు బాధితులను కూడా కేసులో ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. వీధి కుక్కల నియంత్రణపై తాము ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేయకపోతే సిఎస్ లు మరోసారి కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ నవంబర్ 7 కి వాయిదా వేసింది. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా తదుపరి ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో తిరుగాడే కుక్కలకు ఆహారం ఇవ్వడాన్ని నియంత్రించే ఆదేశాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీలో కుక్కలకు ఆహారం ఇచ్చే నిర్దేశిత ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని వెల్లడించింది. కుక్కల కాటుకు గురైన బాధితులు కేసులో జోక్యం చేసుకోవడానికి రూ. 25,000 (వ్యక్తులు) లేదా రూ. 2 లక్షల (ఎన్‌జీఓలు) డిపాజిట్ చేయాలనే నిబంధన నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. భారత జంతు సంక్షేమ బోర్డును ఈ కేసులో ప్రతివాదిగా చేర్చారు. సీనియర్ అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ ఈ కేసులో అమికస్ క్యూరీగా కొనసాగనున్నారు.
జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల అమలుకు సంబంధించి అనుసరణ నివేదికలను దాఖలు చేయనందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులను కోర్టు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మినహా ఇతర రాష్ట్రాలు నివేదికలు సమర్పించక పోవడంతో కోర్టు హాజరయ్యారు.. రాష్ట్రాలు ఇప్పుడు నివేదికలు సమర్పించడంతో, ముఖ్య కార్యదర్శుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జూలై 28, 2025న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇన్ ఎ సిటీ హౌండెడ్ బై స్ట్రేస్, కిడ్స్ పే ప్రైస్ అనే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు వీధి కుక్కల అంశంపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఆగస్టు 11న జస్టిస్ జేబీ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో తిరిగే కుక్కలను ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని, వాటిని విడుదల చేయకూడదని ఆదేశించింది. అయితే, ఆగస్టు 22న జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలను సవాలు చేస్తూ, ఏబీసీ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్, డీవార్మింగ్, ఇమ్యూనైజేషన్ చేసిన కుక్కలను ఎక్కడ నుంచి సేకరించారో అక్కడే తిరిగి విడుదల చేయాలని స్పష్టం చేసింది. రెబిస్ సోకిన లేదా దూకుడుగా ఉన్న కుక్కలకు మినహాయింపు ఇచ్చారు..
పబ్లిక్ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధిస్తూ, నిర్దేశిత ఫీడింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వీధి కుక్కల కేసును ఢిల్లీ-ఎన్‌సీఆర్ కి పరిమితం చేసే అంశంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక జాతీయ విధానం ఉండాలన్న ఆలోచనకి సుప్రీంకోర్టు వచ్చింది. అందుకే రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు వివరణ కోరింది..ఏబీసీ నిబంధనల అమలును నిర్ధారించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జంతు సంరక్షణ శాఖ కార్యదర్శులు, స్థానిక సంస్థలను కేసులో చేర్చారు. దేశవ్యాప్త విధానాన్ని రూపొందించేందుకు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సంబంధిత పిటిషన్‌లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




