AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవనీత్ కౌర్‎కు సుప్రీం కోర్టులో ఊరట.. ఎంపీగా ఆ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు

అమరావతి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా నవనీత్ రాణా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్‎కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

నవనీత్ కౌర్‎కు సుప్రీం కోర్టులో ఊరట.. ఎంపీగా ఆ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు
Navneet Kaur Rana
Srikar T
|

Updated on: Apr 04, 2024 | 4:02 PM

Share

అమరావతి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా నవనీత్ రాణా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్‎కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతి ఎంపీ నవనీత్ రాణా క్యాస్ట్ సర్టిఫికేట్‎కి సంబంధించిన తీర్పు గురువారం వెలువడింది. నవనీత్ రాణాకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్‎ను సుప్రీంకోర్టు సీల్ చేసింది. దీంతో నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు నవనీత్ రాణాకు ఊరట లభించింది. నవనీత్ కౌర్-రానా ఒక సినిమా నటి. ఆమె 2011లో బద్నేరా ఎమ్మెల్యే రవి రాణాను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత, నవనీత్ కౌర్ షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని పొందారు.

అమరావతి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా నవనీత్ రాణా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఆమె కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని బాంబే హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. బాంబే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు నటి నవనీత్ కౌర్. సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ ను పరిశీలించి బాంబే కోర్టు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని సమర్థించింది. బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నవనీత్ రాణాకు భారీ ఊరట లభించింది.

కేసులో జరిగిందిదే..

నవనీత్ రాణా 2013లో క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారు. నవనీత్ రానాకు మోచి కులం సర్టిఫికెట్ ఇచ్చారు. ఆమె సర్టిఫికేట్ కుల ధృవీకరణ కమిటీ ద్వారా ధృవీకరించబడింది. అయితే దానిని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ ఆనందరావు అడ్సుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదనంతరం, బాంబే హైకోర్టు కుల పరిశీలన కమిటీ నిర్ణయాన్ని రద్దు చేసి నవనీత్ కౌర్ సర్టిఫికేట్ చెల్లదని తీర్పును వెలువరించింది. అమరావతి లోక్‌సభ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడింది. నవనీత్ రాణా ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె కుల ధ్రువీకరణ పత్రం బోగస్ అంటూ శివసేన మాజీ ఎంపీ ఆనందరావు అద్సుల్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో నవనీత్ కౌర్ చెప్పులు కుట్టే వర్గానికి చెందిన ఆమె కాదని, ఆమె భర్త చర్మకారుడని తెలిపారు. దీనిపై పరిశీలించిన బాంబే హైకోర్టు ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదని జూన్ 2021లో తీర్పునిచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవనీత్ రాణా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని, ఈ కుల ధృవీకరణ పత్రం చెల్లుతుందని సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆమె నామినేషన్ దాఖలు ప్రక్రియ సుగమం అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…