Lok Sabha Elections 2024: బీహార్ వేదికగా రామ్ విలాస్ పాశ్వాన్ గుర్తు చేసుకుంటూ ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ గురువారం (ఏప్రిల్ 04) బీహార్‌లోని జముయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది విజయోత్సవ ర్యాలీతో పోల్చారు. అదే సమయంలో చిరాగ్ పాశ్వాన్‌ను తన తమ్ముడుగా అభివర్ణించారు. బీహార్ మొత్తం మరోసారి మోదీ ప్రభుత్వ కావాలని కోరుకుంటుందన్నారు మోదీ.
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ గురువారం (ఏప్రిల్ 04) బీహార్‌లోని జముయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది విజయోత్సవ ర్యాలీతో పోల్చారు. అదే సమయంలో చిరాగ్ పాశ్వాన్‌ను తన తమ్ముడుగా అభివర్ణించారు. బీహార్ మొత్తం మరోసారి మోదీ ప్రభుత్వ కావాలని కోరుకుంటుందన్నారు మోదీ.
ర్యాటీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, “ఈ రోజు జముయి నేలపై గుమిగూడిన జనం ప్రజల మానసిక స్థితి ఏమిటో చెబుతున్నారు. జముయి నుంచి బీజేపీ, ఎన్డీయేలకు అనుకూలంగా నిలిచిన జన సందడి బీహార్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఈ రోజు మనమందరం ఒక లోటును అనుభవిస్తున్నాం. బీహార్ కుమారుడు, దళితులు, అణగారిన వర్గాలకు ప్రియమైన, నా ప్రాణ స్నేహితుడు, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత రామ్ విలాస్ పాశ్వాన్ జీ మన మధ్య లేనప్పుడు మనకు ఇది మొదటి ఎన్నికలు. నా తమ్ముడు చిరాగ్ పాశ్వాన్ రామ్ విలాస్ జీ ఆలోచనలను పూర్తి సీరియస్‌గా ముందుకు తీసుకుపోతున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అంటూ ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగంతో అందరిని ఆకట్టుకున్నారు. దీంతో సభ ప్రాంగణమంతా మోదీ, ఎన్డీయే నినాదాలతో మార్మోగింది.
NDA కూటమికి ఓట్లు వేయాలని కోరిన ప్రధాని మోదీ, “బీహార్ భూమి మొత్తం దేశానికి దిశను చూపింది, ఈ బీహార్ భూమి స్వాతంత్ర్య పోరాటంలో, అలాగే స్వతంత్ర భారతదేశ పునాదిని బలోపేతం చేయడంలో భారీ పాత్ర పోషించింది, అయితే దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం తర్వాత, ఆ తర్వాత బీహార్‌కు న్యాయం జరగలేదు. ఎన్‌డీఏ కూటమి బీహార్‌ను కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చిందన్నారు ప్రధాని.
బీహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు, “రైల్వేలో రిక్రూట్‌మెంట్ పేరుతో పేద యువకులను రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు బీహార్ యువతకు ఎప్పటికీ మేలు చేయలేరు.” అని అన్నారు. సంకీర్ణ హయాంలో శిథిలావస్థకు చేరిన రైళ్లు మాత్రమే నడిచేవి, కానీ ఇప్పుడు దేశం మొత్తం లాగే బీహార్ వాసులు కూడా వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ వాళ్లు ప్రజల సొమ్మునంతా దోచుకునేవారని ఆరోపించారు మోదీ. ‘‘ఒకవైపు కొత్త పరిశ్రమల స్థాపన గురించి మాట్లాడే ఎన్డీయే ప్రభుత్వం.. మరోవైపు పరిశ్రమలు తమ గుర్తింపును హైజాక్ చేసిన వ్యక్తులు.. ఒకవైపు ఎన్డీయే. సోలార్ పవర్, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం, మరోవైపు, బీహార్‌ను లాంతరు యుగంలో ఉంచాలని కోరుకునే దురహంకార సంకీర్ణ నేతలు. కాంగ్రెస్ అయినా, ఆర్‌జేడీ అయినా.. అవకాశం దొరికినప్పుడల్లా బీహార్, బీహారీల అహంకారాన్ని అవమానించారు. కర్పూరీ ఠాకూర్‌ను అవమానించినది కాంగ్రెస్, ఆర్‌జేడీ నేతలు అని మోదీ మండిపడ్డారు. ఇటీవలె ఎన్డీయే ప్రభుత్వం బీహార్ గర్వించదగ్గ కర్పూరీ ఠాకూర్‌ను గౌరవించుకుందని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Bihar: During his public rally in Jamui, Bihar, Prime Minister Narendra Modi says "…The huge gathering here in Jamui clearly shows the mood of the people. The voice in favour of BJP and NDA is echoing not only in Bihar but the entire country…" pic.twitter.com/yydso5rHrd
— ANI (@ANI) April 4, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…