AP News: పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై సజ్జల కామెంట్స్.. ఇప్పటి వరకు 60శాతం పూర్తి..

ఏపీలో జరుగుతున్న పెన్షన్ రాజకీయాలపై వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అవాస్తవాలపై మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేష్ రెండేళ్లుగా వాలంటీర్లపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.

AP News: పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై సజ్జల కామెంట్స్.. ఇప్పటి వరకు 60శాతం పూర్తి..
Sajjala Rama Krishna Reddy
Follow us
Srikar T

|

Updated on: Apr 04, 2024 | 2:42 PM

ఏపీలో జరుగుతున్న పెన్షన్ రాజకీయాలపై వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అవాస్తవాలపై మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేష్ రెండేళ్లుగా వాలంటీర్లపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో అవినీతి లేకుండా ఉండాలని సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని వివరించారు. వైసీపీ కోసం వాలంటీర్లను తీసుకొచ్చారని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా నేరుగా పెన్షన్లు అందకుండా చేయాలనే.. చంద్రబాబు నేరుగా కాకుండా నిమ్మగడ్డ రమేష్ ఏర్పాటు చేసుకున్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా ఫిర్యాదు చేయించారన్నారు. తన మీదకు వస్తుందనే భయంతో డబ్బులు లేక పెన్షన్లు వాయిదా వేశారని దుష్ప్రచారం చేశారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వస్తే రూ.3 వేలు ఉన్న పెన్షన్‎ను రూ. 4 వేలు ఇస్తామని తప్పుడు హామీ ఇస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకు సమాజం లో ఉండే అర్హత లేదని విమర్శించారు. అవసాన దశలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ 60 శాతం పెన్షన్లు పంపిణీ జరిగిందని వెల్లడించారు. చంద్రబాబు ఎంత సంజాయిషీ ఇచ్చినా జనం నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. పెన్షన్ల విషయంలో తమపై ప్రజాగ్రహం వస్తుందని టీడీపీ గుర్తించిందన్నారు. అందుకే ఈసీ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సాధారణంగా వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే ప్రతి నెల ఒకటో తారీఖు 80 నుంచి 90 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేదని చెప్పారు. ప్రస్తుతం వాలంటీర్లను విధుల్లో కొనసాగించకూడదన్న ఈసీ ఆదేశాలతో పెన్షన్ల పంపిణీలో జాప్యం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ 60 శాతం మందికి వృద్దాప్య పెన్షన్ అందజేశామని వివరించారు. ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…