AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narsaraopet: ఒకరు మాస్.. మరొకరు క్లాస్.. ఢీ అంటే ఢీ అంటున్న పల్నాడు నేతలు

ఒకరు మాస్... మరొకరు క్లాస్.. ఒకరు మీసం తిప్పి తొడకొడితే.. మరొకరు అందరికి నమస్కారం పెడుతూ ముందుకు సాగుతుంటారు. ఒకర గ్రామ సభల్లో అనర్ఘళంగా మాట్లాడితే, మరొకరు కార్నర్ మీటింగ్స్‌లో తనదైన శైలిలో హితబోధ చేస్తుంటారు. ఆ ఇద్దరూ నేతలు వచ్చే ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటున్నారు. పల్నాడు జిల్లాలో ఇద్దరి నేతల విలక్షణ శైలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Narsaraopet: ఒకరు మాస్.. మరొకరు క్లాస్.. ఢీ అంటే ఢీ అంటున్న పల్నాడు నేతలు
Anil Kumar Yadav Srikrishanadevarayulu
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 04, 2024 | 1:55 PM

Share

ఒకరు మాస్… మరొకరు క్లాస్.. ఒకరు మీసం తిప్పి తొడకొడితే.. మరొకరు అందరికి నమస్కారం పెడుతూ ముందుకు సాగుతుంటారు. ఒకర గ్రామ సభల్లో అనర్ఘళంగా మాట్లాడితే, మరొకరు కార్నర్ మీటింగ్స్‌లో తనదైన శైలిలో హితబోధ చేస్తుంటారు. ఆ ఇద్దరూ నేతలు వచ్చే ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటున్నారు. పల్నాడు జిల్లాలో ఇద్దరి నేతల విలక్షణ శైలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అతని పేరు అనిల్ కమార్ యాదవ్.. నర్సరావుపేట లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. నెల్లూరు జిల్లా నుండి ఇక్కడికి వచ్చినా దూకుడైన రాజకీయాలకు పెట్టింది పేరు. గట్టిగా మాట్లాడటమే కాదు అదే స్థాయిలో ప్రత్యర్ధులపై విరుచుకు పడుతుంటారు. మొదటిసారి నర్సరావుపేట స్థానం నుండి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ మొదటి రోజే తనకు ఇష్టమైన ప్రాంతం పల్నాడని ఇక్కడ నుండి పోటీ చేయడం సంతోషంగా ఉందని ప్రకటించారు. పల్నాడు ప్రాంతంలో తనకిష్టమొచ్చినట్లు మీసం తిప్పి తొడకొట్టవచ్చని అనిల్ చెప్పారు.

అయితే నెల్లూరులో అలా చేస్తే రౌడీ అంటారని, ఇక్కడ మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న అనిల్ అటు టిడిపి నేత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ పై కూడా విరుచుకుపడుతన్నారు. తనకున్న వాగ్ధాటితో పల్నాడు వాసులకు ఆకట్టుకుంటున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా అనిల్ ను శ్రీకృష్ణుడిగా సంబోధిస్తూ రథంపై ఊరేగిస్తున్నారు. దీంతో అనిల్ మాస్ మహారాజ్ ఇమేజ్ తో ఎన్నికల ప్రచారంలో సాగిపోతున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీపి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న శ్రీక్రిష్ణ దేవరాయలు క్లాస్ టచ్‌తో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసిన శ్రీక్రిష్ణ దేవరాయలు.. అదే జోరు కొనసాగాలంటే తనకే ఓటు వేయాలంటున్నారు. ఉన్నత విద్యావంతుడే కాకుండా విద్యాసంస్థల అధిపతిగా ఉన్న శ్రీక్రిష్ణ దేవరాయలు వ్యవహర శైలి అనిల్ కంటే భిన్నంగా ఉంటుంది. వేదికలపై స్పష్టంగా మాట్లాడగలరు కానీ, మాస్‌ను ఆకట్టుకునే పంచ్ డైలాగులు వేయలేరు. తాను చేసింది చేయబోయేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలిగే ఎంపీ, పెద్ద పెద్ద సభల కంటే కార్నర్ మీటింగ్స్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ మందితో కూడిన సభలు సమావేశాలు పెడుతున్నారు.

దీంతో పల్నాడు వాసులు వీరిద్దరి మధ్య పోల్చి చూసుకుంటున్నారు. తమ నేత గొప్ప అంటే తమ నేతే గొప్ప అంటూ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఒకరిపై మరొకరు నేరుగా విమర్శులు చేసుకోని ఇద్దరి నేతలు, తమ విజయానికి సహకరించాలని ప్రజలకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. విలక్షణ శైలితో సాగిపోతున్న వీరిద్దరికి ఆయా పార్టీల కార్యకర్తలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…