అవ్వా.! పెన్షన్ వచ్చిందా? ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్.. వీడియో చూస్తే..

జగన్ బస్సుయాత్రకు తిరుపతి జిల్లాలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఏర్పేడు దగ్గర పెన్షనర్లు ఎదురుపడటంతో వాళ్లతో ముచ్చటించిన జగన్..

అవ్వా.! పెన్షన్ వచ్చిందా? ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్.. వీడియో చూస్తే..

|

Updated on: Apr 04, 2024 | 1:53 PM

జగన్ బస్సుయాత్రకు తిరుపతి జిల్లాలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఏర్పేడు దగ్గర పెన్షనర్లు ఎదురుపడటంతో వాళ్లతో ముచ్చటించిన జగన్.. పెన్షన్‌పై ఆరా తీశారు. అనంతరం వాళ్లతో సెల్ఫీ దిగారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ఏర్పేడులో ఓ అవ్వను ‘అవ్వా.! పెన్షన్ వచ్చిందా? సచివాలయం దగ్గరకు వెళ్లి తెచ్చుకున్నావా? అంటూ ఆప్యాయంగా పలకరించి.. వివరాలను ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్. ఆ వీడియో మీరూ చూసేయండి.

అటు వేరుశనగ రైతులు సీఎం జగన్‌ని ఆప్యాయంగా పలకరించారు. ప్రేమతో జగన్‌కి పల్లీలు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని పథకాలు అందాయా లేదా అని వారిని ఆరా తీశారు సీఎం జగన్. అలాగే ఫోటో కోసం ఓ అభిమాని జగన్ బస్సు వెంట పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ యువకుడిని గమనించిన జగన్.. బస్సు దిగొచ్చి సెల్ఫీ ఇచ్చారు.

Follow us