Supreme Court: సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు.. ఆ 40 అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేయండి
సుప్రీంకోర్టు మరో కీలక తీర్పులు వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట భవంతులను వెంటనే కూల్చివేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు మరో కీలక తీర్పును వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట భవంతులను వెంటనే కూల్చివేయాలని ఆదేశించింది. నోయిడాలో సూపర్ టెక్ ఎమరాల్డ్ కోర్ట్ పేరుతో ఆ సంస్థ నిర్మించిన రెండు టవర్లను కూల్చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థ నిర్మించిన ఈ రెండు టవర్లను 40 అంతస్థుల వరకు నిర్మించింది. వాటిల్లో వెయ్యి వరకు ఫ్లాట్స్ ఉన్నాయి. టవర్ల నిర్మాణంలో సూపర్ టెక్ సంస్థ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని సుప్రీం కోర్టు నిర్దారించింది. నోయిడా అథారిటీ నుంచి ఎటువంటి పర్మిషన్ రాకముందే సూపర్‌టెక్ ఎమరాట్డ్ టవర్స్ నిర్మాణం మొదలుపెట్టేశారని.. దీని గురించి తెలిసినా అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ధర్మాసనం గుర్తించింది. కన్‌స్ట్రక్షన్ కంపెనీవారితో నోయిడా అథారిటీ అధికారులు కుమ్మక్కయాయని గతంలోనే హైకోర్టు వెల్లడించినదానిలో వాస్తవం వుందని పేర్కొంది.
సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించడంపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ రెండు టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని.. దానికయ్యే ఖర్చునూ సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కూల్చవేత సమయంలో ఇతర బిల్డింగ్స్‌కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్ టెక్ కంపెనీకి సూచించింది.
Supreme Court orders demolition of two 40-floor towers built by real estate company Supertech in one of its housing projects in Noida; says construction was a result of the collusion between the officials of the Noida authority and Supertech pic.twitter.com/5Vx3rSmHCd
— ANI (@ANI) August 31, 2021
ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్