AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: కోల్‌కతాలో భారీ భూకంపం.. పలు ప్రాంతాల్లో కంపించిన భూమి!

కోల్‌కతాలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. 10:10 గంటల ప్రాంతంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయపడిపోయిన జానాలు ఇళ్లలోంచి బయటకు పరులుగులు తీశారు. కోల్‌కతాతో పాటు, సిలిగురి, జల్పైగురి, కూచ్ బెహార్, దక్షిణ దినాజ్‌పూర్‌లలో భూమి స్వల్పంగా కంపించినట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Earthquake: కోల్‌కతాలో భారీ భూకంపం.. పలు ప్రాంతాల్లో కంపించిన భూమి!
Earthquake
Anand T
|

Updated on: Nov 21, 2025 | 11:42 AM

Share

కోల్‌కతాలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. కోల్‌కతా, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్‌ల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల 9 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించింది. అనేక నగరాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకంపనలు సంభవించాయి. ఆయా ప్రాంతాల్లో 18 సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. కోల్‌కతాతో పాటు, సిలిగురి, జల్పైగురి, కూచ్ బెహార్, మాల్డా, దక్షిణ దినాజ్‌పూర్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించినట్టు కొన్ని నివేదికలు తెలిపాయి.

దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. భూకంపం మూలాను ఇంకా కనుక్కోలేదని తెలిపారు. అయితే ఈ భూకంపం ధాటికి, ఇళ్లు, ఆఫీస్‌లు, అపార్ట్‌మెంట్లలోని జనాలు భయాందోళనకు గురయ్యారని.. దీంతో నివాసాల్లో ఉన్న వారంతా.. ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారని స్థానిక మీడియాలో పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us