AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి ఘనంగా పెళ్ళి.. ఇద్దరు కలిసి డాన్సులు.. తెల్లాసరికల్లా పెళ్లి కూతురు జంప్..!

మూడు నెలల క్రితం పల్లవి, సునీల్ కుమార్ గౌతమ్ ల వివాహం నిశ్చయమైంది. మంగళవారం (నవంబర్ 18) రాత్రి, వరుడి ఊరేగింపు దాదాపు 90 మంది అతిథులతో బారాబంకి చేరుకుంది. ఆచారాలు ముగిసిన తర్వాత ఈ జంట దండలు మార్చుకున్నారు. వివాహం అర్థరాత్రి ఘనంగా జరిగింది. జయమాల వేడుక తర్వాత వధూవరులు వేదికపై కలిసి డాన్స్ కూడా చేశారు.

రాత్రి ఘనంగా పెళ్ళి.. ఇద్దరు కలిసి డాన్సులు.. తెల్లాసరికల్లా పెళ్లి కూతురు జంప్..!
Bride Disappears
Balaraju Goud
|

Updated on: Nov 21, 2025 | 9:26 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘనంగా పెళ్లి వేడుక జరిగింది. అన్ని ఆచారాలు పూర్తి చేసుకున్న కొన్ని గంటల తర్వాత పెళ్లికూతురు అదృశ్యమైంది. దీంతో వరుడి కుటుంబం ఇప్పుడు వధువు కుటుంబంపై ఫిర్యాదు చేసింది.

మూడు నెలల క్రితం పల్లవి, సునీల్ కుమార్ గౌతమ్ ల వివాహం నిశ్చయమైంది. మంగళవారం (నవంబర్ 18) రాత్రి, వరుడి ఊరేగింపు దాదాపు 90 మంది అతిథులతో బారాబంకి చేరుకుంది. ఆచారాలు ముగిసిన తర్వాత ఈ జంట దండలు మార్చుకున్నారు. వివాహం అర్థరాత్రి ఘనంగా జరిగింది. జయమాల వేడుక తర్వాత వధూవరులు వేదికపై కలిసి డాన్స్ కూడా చేశారు.

బుధవారం ఉదయం, విదాయి వేడుకకు సన్నాహాలు ప్రారంభమవుతుండగా, వధువు పల్లవి కనిపించకుండాపోయింది. మొదట, ఆమె సమీపంలోనే ఉందని కుటుంబసభ్యులు భావించారు. కానీ రెండు కుటుంబాలు గంటల తరబడి తీవ్రంగా వెతుకుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం దాటిన, ఆమె జాడ తెలియకపోవడంతో, అందరూ భయాందోళనలకు గురయ్యారు.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం, వధువు తన ప్రేమికుడితో పారిపోయి ఉండవచ్చని తేలింది. దీంతో ఇంట్లో గందరగోళం నెలకొంది. అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహ ఆచారాలన్నీ పూర్తయిన తర్వాత ఆమె రాత్రి వెళ్లిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు, వరుడి కుటుంబం వధువు కుటుంబంపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. దీంతో యువతి కదలికలను తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ లొకేషన్లు, సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us