Watch Video: సార్.. నేను గర్భిణీ వదిలేయండి ప్లీజ్.. అని వేడుకున్నా వినని పోలీస్.. షాకింగ్ వీడియో!
పట్నాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.. స్కూటీపై రూ.12వేల ట్రాఫిక్ చలాన్ ఉందని.. ఒక జంటకు చెందిన వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రతయ్నించారు. ఈ క్రమంలో సదురు యువుతి.. సర్ నేను గర్బిణీ ప్లీజ్ వదిలేయండి అని వేడుకున్నా.. వినకుండా ఓ పోలీస్ అధికారి స్కూటీని బలవంతంగా తీసుకునేందు ప్రయత్నించాడు. దీంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతిని సైతం స్కూటీతో లాక్కెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాట్నాలోని మెరైన్ డ్రైవ్‌లో భాగంగా.. ఓ గర్భిణీ స్త్రీకి, పోలీసు అధికారికి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం హై వోల్టేజ్ డ్రామాగా మారింది. ఆమె స్కూటీపై రూ.12,000 పైగా చాలన్స్ ఉన్నాయని పోలీసులు.. ఆమె వాహనాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె పోలీసులను అడ్డుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మైరెన్ రోడ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒక జంట స్కూటీపై రాంగ్ రూట్‌లో వచ్చి పోలీసులకు పట్టుబడింది.
దీంతో పోలీసులు ఆ స్కూటీపై ఉన్న ట్రాఫిక్ చలాన్స్‌ను చెక్ చేయగా.. రూ.12 వేల పెండింగ్ చలాన్స్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో వాళ్ల బైక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ స్కూటీపై ఉన్న యువతీ పోలీసులతో సార్.. నేను గర్భవతిని, దయచేసి ఇలా చేయవద్దు.. మమ్మల్ని వదిలేయండని ప్లీజ్ అని కోరింది. కానీ పోలీసులు అవేవి పట్టించుకోకుండా.. బైక్‌ను తీసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మహిళ స్కూటీకి అడ్డంగా నిలబడి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పోలీస్ అధికారి మాత్రం ఆమెను అలాగే ముందు నెట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాహనం ఆమెకు తాకడంలో తను గాయపడినట్టు ఆమె ఆరోపించింది.
అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఇందుకు సంబంధించిన వీడియోను తిసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్బిణీ అని కూడా చూడకుండా అలా ప్రవర్తించడమేంటని మండిపడుతున్నారు.
इस पुलिस वाले की हिम्मत देखिए, यह किस तरह से एक गर्भवती महिला को अपने स्कूटी से रौंदनें की कोशिश कर रहा है।
यह वीडियो पटना के मरीन ड्राइव का है pic.twitter.com/QapP9avC2J
— Priya singh (@priyarajputlive) November 19, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
