AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె పగిలే విషాదం.. 500 అడుగుల లోయలో పడ్డ థార్.. స్పాట్‌లోనే..

పూణే-మాంగావ్ రోడ్డులోని తమ్హిని ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో థార్ కారు 500 అడుగుల లోయలో పడిపోయింది. కొంకణ్ టూర్‌కు వెళ్తున్న ఆరుగురు పూణే యువకులు ఈ దుర్ఘటనలో మరణించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టగా, మృతదేహాలు, కారు శకలాలు లభ్యమయ్యాయి.

గుండె పగిలే విషాదం.. 500 అడుగుల లోయలో పడ్డ థార్.. స్పాట్‌లోనే..
Tamhini Ghat Accident
Krishna S
|

Updated on: Nov 20, 2025 | 7:59 PM

Share

పూణే-మాంగావ్ రోడ్డులోని తమ్హిని ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో థార్ కారు 500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు యువకులు మరణించారు. మరణించిన వారందరూ పూణేలోని ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన నివాసితులు.

కొంకణ్ టూర్ వెళ్తుండగా..

పూణేలోని ఖడక్వాస్లా-ఉత్తం నగర్ నుండి ఆరుగురు యువకులు సోమవారం అర్ధరాత్రి కొంకణ్ టూరిజంకు బయలుదేరారు. వీరి కారు రిజిస్ట్రేషన్ నంబర్ MH14 HW 7575. తమ్హిని ఘాట్ వంపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంగళవారం ఈ యువకుల మొబైల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. వెంటనే పూణే, మాంగావ్ పోలీసులకు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఈ యువకుల చివరి ఆచూకీ తామ్హిని ఘాట్‌లో లభించడంతో డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

సంఘటన స్థలంలో మాంగావ్ పోలీసులు, SVRSS, షెలార్ మామా రెస్క్యూ టీం, తాళ్ల సహాయంతో లోయలోకి దిగి అన్వేషణ చేపట్టాయి. కొండ కూలిపోయిందని తెలుసుకున్న స్థానికుల ద్వారా ఇక్కడ ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ బృందానికి తెలిసింది. లోయలోకి దిగిన రెస్క్యూ బృందం కారు శకలాలను, అందులోని యువకుల మృతదేహాలను వెలికితీశారు. మరణించిన యువకులందరూ 22 – 25 ఏళ్ల మధ్య వయస్సు గలవారు కావడం మరింత విషాదాన్ని నింపింది.

మృతుల వీరే..

ప్రమాదంలో మరణించిన ఆరుగురు యువకులు పూణేలోని ఉత్తమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. సాహిల్ సాధు గోటే (24), శివ అరుణ్ మానె (19), ఓంకార్ సునీల్ కోలి (18), మహదేవ్ కోలి (18), ప్రథమ్ రావ్జీ చవాన్ (24), పునీత్ సుధాకర్ శెట్టి (20). మాంగావ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..