Strain Virus: భయాందోళనకు గురి చేస్తున్న యూకే స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో కొత్తగా 25 కేసులు నమోదు

Strain Virus: భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోగా, తాజాగా మంగళవారం కొత్తగా...

Strain Virus: భయాందోళనకు గురి చేస్తున్న యూకే స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో కొత్తగా 25 కేసులు నమోదు
Follow us

|

Updated on: Jan 19, 2021 | 8:44 PM

Strain Virus: భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోగా, మంగళవారం కొత్తగా 25 కొత్తరకం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 141కి చేరింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కావడం, అందులో కోవిడ్‌-19 కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఈ కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌ మామూలు వైరస్‌ కన్నా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. దీంతో భారత్‌ వెంటనే అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. ఈ బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు వ్యాప్తించింది. ఇదే తరహాలో దక్షిణాఫ్రికా వేరియంట్‌ వైరస్‌ను ఇప్పటి వరకు 20 దేశాల్లో గుర్తించారు.

అయితే రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్స్‌ ఈ న్యూ స్ట్రెయిన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్రిటన్‌ , దక్షిణ ఆఫ్రికా లో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిచిన విషయం తెలిసిందే.

కాగా, ఈ కొత్తరకం యూకే వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది. కరోనా లాగే ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు పెరగకుండా ఉండేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఈ స్ట్రెయిన్‌ వైరస్‌ విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం ఎప్పటికప్పుడు కేంద్రం అప్రమత్తం చేస్తోంది.

Also Read:

Corona Vaccine: రెండు రోజుల విరామం తర్వాత ముంబై, పుణెలలో ప్రారంభమైన కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ